ఇలా అయితే ఉరిశిక్ష అనుమానమే..! రూట్ మార్చిన దోషుల తల్లిదండ్రులు..!!

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవ్వడంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉంది. అయితే చట్టంలో ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ దోషులు ఉపయోగించుకున్నారు. అయితే అన్ని రకాలుగా అవకాశాలు ముగియడంతో.. ఇక ఉరిశిక్ష 20వ తేదీన ఖచ్చితంగా పడుతుందని భావిస్తున్నారు. అయితే దోషులు మరోకొత్త ప్లాన్ వేస్తూ.. మళ్లీ కోర్టు […]

ఇలా అయితే  ఉరిశిక్ష అనుమానమే..! రూట్ మార్చిన దోషుల తల్లిదండ్రులు..!!
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2020 | 1:43 PM

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవ్వడంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉంది. అయితే చట్టంలో ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ దోషులు ఉపయోగించుకున్నారు. అయితే అన్ని రకాలుగా అవకాశాలు ముగియడంతో.. ఇక ఉరిశిక్ష 20వ తేదీన ఖచ్చితంగా పడుతుందని భావిస్తున్నారు. అయితే దోషులు మరోకొత్త ప్లాన్ వేస్తూ.. మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా దోషుల తల్లిదండ్రులు తమకు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ రాష్ట్రపతిని కోరుతూ లేఖరాశారు. ఈ లేఖ రాసిన వారిలో నిందితుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, దోషుల పిల్లలు కూడా ఉన్నారు. ‘‘మేమంతా కారుణ్య మరణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని తమను(రాష్ర్టపతి) కోరుతున్నాం. రాబోయే రోజుల్లో నిర్భయ వంటి ఘటనలు జరగకుడా నిలువరించవచ్చు. కోర్టు కూడా ఒకరి స్థానంలో 5గురిని ఉరితీయమంటూ ఆదేశాలివ్వాల్సిన పని ఉండదు. మన దేశంలో పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని కూడా క్షమాభిక్ష ప్రసాదించిన సంఘటనలు ఉన్నాయి. ప్రతీకారమనేది అధికారానికి నిర్వచనం కాదు. క్షమించడంలో కూడా అధికారం ఉంటుంది” అంటూ నిర్భయ దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్భయ దోషులందరి క్షమాభిక్ష పిటిషన్లను రిజెక్ట్ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం.. దోషుల్లో ఒకరైన అక్షయ్‌ సింగ్ రాష్ట్రపతికి మరోసారి క్షమాభిక్ష పిటిషన్ వేశాడు. గతంలో తన క్షమాభిక్ష పిటిషన్‌లో పూర్తి వివరాలను అటాచ్ చేయలేదని.. అందుకే అప్పుడు రిజెక్ట్ అయ్యిందని దరఖాస్తులో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ దోషులు వేసిన పలు పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు