AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా : ఒక్క ఫోన్ కాల్‌తో వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం

కొవిడ్-19 ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ట్రీట్‌మెంట్ కోసం కొన్ని కంపెనీలు లోన్లు కూడా అందిస్తున్నాయి. అది కూడా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాయి. దాని కోసం ఒక్క ఫోన్ కాల్ .....

కరోనా : ఒక్క ఫోన్ కాల్‌తో వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణం
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2020 | 2:22 PM

Share

కొవిడ్-19 ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఇది ఎంతటి ప్రమాదకర వైరస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకంతకూ విస్తరిస్తోన్న వైరస్‌ను ఎదుర్కొవడానికి ఇప్పటికే చాలా దేశాల్లో బంద్ కొనసాగుతోంది. దీని దాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇంకా వేలల్లో వైరస్ బారిన పడ్డ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ట్రీట్‌మెంట్ కోసం కొన్ని కంపెనీలు లోన్లు కూడా అందిస్తున్నాయి. అది కూడా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాయి.

కరోనా బాధితులకు ఆర్థిక తోడ్పాటు నందించేందుకు కేర్‌కవర్ అనే హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్ కంపెనీ ముందుకు వచ్చింది. కరోనా వైరస్ ట్రీట్‌మెంట్ కోసం రూ.5 లక్షల వరకు రుణాన్ని ఆఫర్ చేస్తోంది. అది గంటలోనే లోన్ పొందొచ్చని కంపెనీ తెలిపింది. ఇక్కడ మరో వెసులుబాటు కూడా ఉంది. కేర్‌కవర్ సంస్థ కరోనా వైరస్ ట్రీట్‌మెంట్ కోసం అందించే రుణాలపై ఎటువంటి వడ్డీ ఉండదని సంస్థ స్పష్టం చేసింది. ఇది ఏడాది వరకు కాల పరిమితిలోని రుణాలకు వర్తిస్తుంది. అదే లోన్ టెన్యూర్ 18 నుంచి 24 నెలల మధ్యలో ఉంటే అప్పుడు వడ్డీ రేటు 12-15 శాతం మధ్యలో ఉంటుంది. లోన్ కింద కనీసం రూ.15,000 తీసుకోవచ్చు. కేర్‌కవర్ నుంచి హెల్త్‌కేర్ బెనిఫిట్స్ పొందాలంటే.. రుణ గ్రహీత ముందుగా పేరు నమోదు చేసుకొని, కార్డు పొందాల్సి ఉంటుందని కేర్‌కవర్ ఫౌండర్, సీఈవో నివేశ్ ఖండెల్వాల్ వెల్లడించారు. ఇకపోతే 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఎవరైనాసరే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

కాగా లోన్‌కు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. కవర్‌కేర్ కార్డు కలిగిన వారు కేవలం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్‌కు (9298889888) కాల్ చేసి లోన్ పొందొచ్చని తెలిపారు. దీని కోసం పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి కేవైసీ డాక్యుమెంట్ల అవసరం అవుతాయి. పేరు, హాస్పిటల్ పేరు, ట్రీట్‌మెంట్ కోసం ఎంత డబ్బులు కావాలి? వంటి వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. ఇక్కడ రుణ గ్రహీత హాస్పిటల్ నుంచి రోగి పేరు, బిల్లు అమౌంట్‌ అంచనా ద్రువీకరణ కోసం సంస్థకు ఒక లెటర్‌ అందజేయాల్సి ఉంటుంది.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు