కాసేపట్లో సీబీఐ కోర్టుకు చిదంబరం..

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో సీబీఐ అధికారులు ఏకంగా ఢిల్లీలోని ఆయన ఇంటి గోడ దూకి మరీ వెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత రాత్రంతా సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ ఆయన్ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చిదంబరం. కానీ అది […]

కాసేపట్లో సీబీఐ కోర్టుకు చిదంబరం..
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 9:43 AM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో సీబీఐ అధికారులు ఏకంగా ఢిల్లీలోని ఆయన ఇంటి గోడ దూకి మరీ వెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత రాత్రంతా సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ ఆయన్ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చిదంబరం. కానీ అది శుక్రవారం విచారణకు రానుంది. ఇవాళ కోర్టులో విచారణ కోసం తమకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని  సీబీఐ కోరిన పక్షంలో 14 రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సీబీఐ తర్వాత ఈడీ కూడా విచారణకు రెడీగా ఉంది. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి భారీగా నిధులు రావడంపై మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ ప్రశ్నించనుంది. ఇలా ఒకరి తర్వాత మరొకరు చిదంబరంను కస్టడీకి తీసుకుంటే ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకేమీ సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి ఇలా కేసుల్లో ఇరికిస్తుందని చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆరోపిస్తున్నారు. తన తండ్రికి ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో