ఈ వాటర్ ట్యాంక్ కట్టి నాలుగేళ్లు కాలేదు.. ఎలా కుప్పకూలిందో చూడండి
పశ్చిమ బెంగాల్‌లో ఈ సంఘటన చూస్తే అక్కడ అధికారుల పనితీరు ఎంత బాగుందో అర్థమవుతోంది. బంకురా జిల్లాలోని ఓ వాటర్ ట్యాంక్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అది ఏ పురాతన ట్యాంక్ అంటే పప్పులో కాలేసినట్లే. సరిగ్గా నాలుగేళ్ల క్రితమే దానిని ఓపెనింగ్ చేశారు. 7 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ ద్వారా.. దాదాపు 15 గ్రామాలకు వాటర్ సప్లై చేయబడుతుంది. అయితే 2016లో ప్రారంభించిన ఈ ట్యాంక్.. బుధవారం రోజు మధ్యాహ్నం.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. […]
పశ్చిమ బెంగాల్‌లో ఈ సంఘటన చూస్తే అక్కడ అధికారుల పనితీరు ఎంత బాగుందో అర్థమవుతోంది. బంకురా జిల్లాలోని ఓ వాటర్ ట్యాంక్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అది ఏ పురాతన ట్యాంక్ అంటే పప్పులో కాలేసినట్లే. సరిగ్గా నాలుగేళ్ల క్రితమే దానిని ఓపెనింగ్ చేశారు. 7 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ ద్వారా.. దాదాపు 15 గ్రామాలకు వాటర్ సప్లై చేయబడుతుంది. అయితే 2016లో ప్రారంభించిన ఈ ట్యాంక్.. బుధవారం రోజు మధ్యాహ్నం.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు ఈ సంఘటనను వీడియో తీశారు. భారీ శబ్ధంతో కేవలం సెకన్ల వ్యవధిలోనే కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడివారు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
కాగా, ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. అక్కడి భూమి వదులుగా ఉండటంతో ఘటన జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. ట్యాంక్ కూలిన ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. ట్యాంక్ నిర్మించిన సంస్థతో ఐదేళ్లు కాంట్రాక్ట్ ఉందని..ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
#WATCH West Bengal: An overhead water tank collapses in Sarenga, Bankura. (22.01.20) pic.twitter.com/U48ORwb8Ic
— ANI (@ANI) January 23, 2020