అట్లాస్ సైకిల్స్ యజమాని భార్య అనుమానాస్పద మృతి.. కారణమిదేనా.?

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్ కపూర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య నటాషా కపూర్(57) ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో నటాషా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. ఆమె బలవన్మరణానికి పాల్పడిన సమయంలో ఇంట్లో ఆమె కొడుకు, కూతురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలీసులకు ఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్‌ దొరికినట్లు సమాచారం. […]

అట్లాస్ సైకిల్స్ యజమాని భార్య అనుమానాస్పద మృతి.. కారణమిదేనా.?
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jan 23, 2020 | 1:18 PM

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్ కపూర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య నటాషా కపూర్(57) ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో నటాషా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా.. ఆమె బలవన్మరణానికి పాల్పడిన సమయంలో ఇంట్లో ఆమె కొడుకు, కూతురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలీసులకు ఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్‌ దొరికినట్లు సమాచారం.

మరోవైపు ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఆర్ధిక సంక్షోభమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. ఇకపోతే అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. ఇక ఆమె మృతదేహానికి గంగారాం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..