AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ ఓ లెజెండ్.. ప్రశంసలతో ముంచెత్తిన స్మిత్!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.? ఠక్కున గుర్తొచ్చే రెండు పేర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్. అన్ని ఫార్మాట్లలోనూ తమదైన శైలిలో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారు. ఇక వీరిద్దరిలో ఎవరు గొప్పా అని మాజీ క్రికెటర్ల దగ్గర నుంచి విశ్లేషకుల వరకు అందరూ చర్చించుకుంటారు. కొందరు విరాట్ ది బెస్ట్ అని అంటే.. మరికొందరు స్మిత్‌ అద్భుతమైన ఆటగాడని అంటుంటారు. అయితే స్మిత్ మాత్రం తనకంటే కోహ్లీనే గొప్ప ఆటగాడని చెప్పడమే కాకుండా […]

కోహ్లీ ఓ లెజెండ్.. ప్రశంసలతో ముంచెత్తిన స్మిత్!
Ravi Kiran
|

Updated on: Jan 23, 2020 | 11:13 AM

Share

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.? ఠక్కున గుర్తొచ్చే రెండు పేర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్. అన్ని ఫార్మాట్లలోనూ తమదైన శైలిలో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారు. ఇక వీరిద్దరిలో ఎవరు గొప్పా అని మాజీ క్రికెటర్ల దగ్గర నుంచి విశ్లేషకుల వరకు అందరూ చర్చించుకుంటారు. కొందరు విరాట్ ది బెస్ట్ అని అంటే.. మరికొందరు స్మిత్‌ అద్భుతమైన ఆటగాడని అంటుంటారు. అయితే స్మిత్ మాత్రం తనకంటే కోహ్లీనే గొప్ప ఆటగాడని చెప్పడమే కాకుండా అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఒక అద్భుతం. అతడు సాధించిన రికార్డులే.. అతను అత్యుత్తమ ఆటగాడని చెప్పకనే చెబుతున్నాయి. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతూ లెజెండ్స్ నెలకొల్పిన రికార్డులను సైతం తన వశం చేసుకుంటున్నాడు. మున్ముందు ఇంకా ఎన్నో రికార్డులు కోహ్లీ సొంతం కానున్నాయి. అతడి పరుగుల దాహాన్ని ఎవరూ ఆపలేరు. అటు ‘స్పిరిట్ అఫ్ ది క్రికెట్’ అవార్డు కోహ్లీకి దక్కడం కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని స్మిత్ అన్నాడు.

ఒక్క ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇండియాకు అద్భుతమైన విజయాలు అందించడంలో ఎంతగానో కృషి చేశాడు. ధోని తర్వాత టీమిండియాను విజయపథంలో నడిపిస్తూ… అన్ని ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలబెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాడని స్టీవ్ స్మిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Follow Us