AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.4కోట్ల వాచ్‌ ఆర్డర్ చేసిన యువకుడు.. డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి చూడగా దిమ్మతిరిగే షాక్..

ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్, ఆమెజాన్ వంటి ఈ కామర్స్‌ ప్లాప్‌ఫామ్‌లలో గ్యాజెట్స్‌ ఆర్డర్ చేస్తే కొన్ని సార్లు ఫేక్ వస్తువులు రావడం మనం చాలానే చూశాం. తాజాగా అలాంటి మోసమే చెన్నైలో వెలుగు చూసింది. ఆన్‌నైన్‌లో రూ.4 కోట్ల విలువైన వాచ్‌ను ఆర్డర్ ఇచేసిన ఒక వ్యక్తికి ఊహించని ట్విస్ట్‌ తగిలింది. ఆయనకు రావాల్సి వాచ్‌కు బదులుగా డెలివరీలో రూ.400 విలువైన చౌకబార వాచ్‌ వచ్చింది. ఇది చూసి షాకైన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రూ.4కోట్ల వాచ్‌ ఆర్డర్ చేసిన యువకుడు.. డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి చూడగా దిమ్మతిరిగే షాక్..
Online Fraud
Anand T
|

Updated on: Oct 23, 2025 | 11:50 AM

Share

ఆన్‌లైన్‌లో వాచ్‌ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన వాచ్‌ డెలివరీ తీసుకునేందుకు వెళ్లిన అతను డెలివరీలో వచ్చిన దాన్ని చూసి కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ బట్టల వ్యాపారి కుమారుడు ఇటీవల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ.4 కోట్ల విలువైన వాచ్‌ను చూసి మనసుపారేసుకున్నాడు. దాన్ని ఎలాగైనా కొనాలని నిర్ణయించుకొని. స్థానికంగా ఉన్న ఒక ఏజెంట్‌ను సంప్రదించాడు. అతని ద్వారా వాచ్‌ కొనేందుకు అతని ముందుగా ఆన్‌లైన్‌లో రూ.2.3 కోట్లు చెల్లించాడు.

అయితే మంగళవారం తను చేసిన ఆర్డర్ వచ్చినట్టు అతనికి కాల్ వచ్చింది. దీంతో ఆర్డర్ తీసుకునేందుకు ఆతను ఎంతో ఆశగా, ఆత్రుగా బయల్దేరాడు. డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకున్నాడు. వెంటనే దాన్ని విప్పి చూశాడు. అందులో తును ఆర్డర్ చేసిన రూ.4 కోట్ల విలువైన వాచ్‌కు బదులుగా కేవలం రూ.400 విలువైన చౌకబారు వాచ్ ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఏజెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌గా చెల్లించిన రూ. 2.30 కోట్లు తిరిగి ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చుసుకున్న కొట్టూరుపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు విచారణ కోసం పంపనున్నట్లు పోలీసు వర్గాల్లో సమాచారం అందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..