లక్షరూపాయల ఉల్లిగడ్డలు గోవిందా! దొంగల చేతివాటం

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. పాపం.. అలా అనుకునే.. ఇంట్లో దాచుకున్న ఉల్లిపాయలను ఎత్తుకెళ్లారు దొంగలు. ప్రస్తుతం దేశంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి.. ఉల్లిని కోస్తేనే కాదు.. కొన్నా కన్నీళ్లు వస్తున్నాయి. ఎందకంటే.. ఉల్లి రేటు అంతలా పెరిగింది కాబట్టి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ.80 నుంచి 100 రూపాయల వరకూ పలుకుతుంది. మార్కెట్‌లో ఉల్లికి డిమాండ్ పెరిగిపోవడంతో.. దొంగలు ఏకంగా ఓ ఇంట్లోని లక్ష రూపాయల విలువ చేసే ఉల్లిపాయల్ని దోచేశారు. […]

లక్షరూపాయల ఉల్లిగడ్డలు గోవిందా! దొంగల చేతివాటం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 24, 2019 | 4:15 PM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. పాపం.. అలా అనుకునే.. ఇంట్లో దాచుకున్న ఉల్లిపాయలను ఎత్తుకెళ్లారు దొంగలు. ప్రస్తుతం దేశంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి.. ఉల్లిని కోస్తేనే కాదు.. కొన్నా కన్నీళ్లు వస్తున్నాయి. ఎందకంటే.. ఉల్లి రేటు అంతలా పెరిగింది కాబట్టి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ.80 నుంచి 100 రూపాయల వరకూ పలుకుతుంది. మార్కెట్‌లో ఉల్లికి డిమాండ్ పెరిగిపోవడంతో.. దొంగలు ఏకంగా ఓ ఇంట్లోని లక్ష రూపాయల విలువ చేసే ఉల్లిపాయల్ని దోచేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఉల్లిపాయల ఎగుమతికి కేంద్రమైన నాశిక్ జిల్లాలో.. జరిగిందీ ఘటన. అక్కడ ప్రమాదకరంగా తయారైన దొంగలు.. రకరకాల చోరీలు చేస్తూ భయపెడుతున్నారు. తాజాగా.. వాళ్ల కళ్లు ఉల్లిపాయలపై పడ్డాయి. కల్వాన్ ‌ఊరిలో రైతు రాహుల్ బాజీరావ్.. తన ఇంటిలోనే.. ఉల్లిపాయల్ని స్టోర్‌ చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. రోజూలానే.. ఇంట్లోని వారంతా ఆదివారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచివున్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇంట్లోని ఉల్లిపాయలు మాయమయ్యాయి. ప్రస్తుత ధర ప్రకారం వాటి విలువ లక్షకు పైగానే ఉంది. దీంతో.. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. బీహార్‌లో పాట్నాలోని ఓ గోడౌన్‌లో 8 లక్షల విలువైన ఉల్లిపాయల్ని దొంగిలించారు దుండగులు. దాదాపు 387 ఉల్లి గోనె సంచులతో ఉడాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.