నేను జోక్యం చేసుకుంటా..చేసుకుంటా.. మూడోస్సారి..!

భారత, పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనను పరిష్కరించే విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. హౌడీమోడీ ఈవెంట్ సందర్భంగా హూస్టన్ లో ప్రధాని మోడీతో వేదికను పంచుకుని 24 గంటలైనా గడవకముందే.. తనతో భేటీ అయిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్ద ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాశ్మీర్ సమస్యపై మీ ఇద్దరి (ఇమ్రాన్, మోడీ) మధ్య ఒప్పందం కుదరాలని, అందుకు నన్ను జోక్యం చేసుకోవాలని […]

నేను జోక్యం చేసుకుంటా..చేసుకుంటా.. మూడోస్సారి..!
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 24, 2019 | 11:52 AM

భారత, పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనను పరిష్కరించే విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. హౌడీమోడీ ఈవెంట్ సందర్భంగా హూస్టన్ లో ప్రధాని మోడీతో వేదికను పంచుకుని 24 గంటలైనా గడవకముందే.. తనతో భేటీ అయిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్ద ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాశ్మీర్ సమస్యపై మీ ఇద్దరి (ఇమ్రాన్, మోడీ) మధ్య ఒప్పందం కుదరాలని, అందుకు నన్ను జోక్యం చేసుకోవాలని కోరితే నేను రెడీ అని ఆయన అన్నారు. ఇలా తాను ఈ విషయంలో ‘ పెద్దన్న ‘ పాత్ర పోషిస్తానని ట్రంప్ ‘ వక్కాణించడం ‘ ఇది మూడోసారి. ‘ నేను తప్పకుండా సహాయపడతాను. నాకు మోడీతోనూ, ఖాన్ తోనూ ,గాఢమైన ఫ్రెండ్ షిప్ ఉంది. పైగా నేను మంచి మధ్యవర్తిని కూడా.. ఇలాంటి రోల్ లో నేనెప్పుడూ విఫలం కాలేదు ‘ అని ట్రంప్ సారు ‘ గర్వంగా ‘ చెప్పారు. (అమెరికాలో ఓ వైపు గన్ కల్చర్ పెరిగిపోతూ.. అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తూంటే ఆయన ఇలాంటి బీరాలు పోవడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు). గతంలో కూడా ఆయన ఇలాంటి ప్రకటన చేసినప్పుడు ఇండియా పూర్తిగా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. కాశ్మీర్ ద్వైపాక్షిక సమస్య అని, దీన్ని తామే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెగేసి చెప్పింది.

హౌడీమోడీ కార్యక్రమం సందర్భంగా మోడీ పరోక్షంగా పాకిస్తాన్ పై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. వాళ్ళు (పాక్) భారతదేశం పట్ల ద్వేషాన్ని వెలిగక్కుతున్నారని, ఉగ్రవాదానికి మద్దతునిస్తున్నారని, టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో నవంబరు 9 న జరిగిన దాడులైనా, ముంబైలో నవంబరు 26 న సంభవించిన పేలుళ్లయినా ఇందుకు బాధ్యత ఎవరిదన్న విషయం ప్రపంచానికంతటికీ తెలుసునన్నారు. కాగా-ఇస్లామిక్ టెర్రరిజం నుంచి అమాయక ప్రజలకు కలిగే ముప్పునుంచి వారిని తాను కాపాడుతానని ట్రంప్ పేర్కొన్నారు. యుఎస్-పాకిస్థాన్ మధ్య సంబంధాల గురించి ప్రస్తావించిన ఆయన.. పాక్ ను తాను ‘ బ్యాడ్ ‘ గా పరిగణిస్తానని చెప్పారు. అంతలోనే మాట మార్చి.. ఆ దేశం పట్ల తనకు విశ్వాసం ఉందని కానీ తన ముందున్నవారు దీన్ని నమ్మబోరని పరోక్షంగా మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ట్రంప్ వెనుకంజ వేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఇది మీ దేశ చరిత్రలోనే చిరకాలంగా నలుగుతున్న సమస్య అన్నారు. న్యూయార్క్ లో విదేశీ సంబంధాలపై జరిగిన సమావేశంలో మాట్లాడిన ఖాన్.. కాల్పుల విరమణకు అనువుగా తాలిబన్లతో చర్చలను పునరుధ్ధరించాలని, ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికన్ దళాలను ఉపసంహరించాలని కోరారు. ఈ నెలారంభంలో అమెరికాకు, తాలిబన్లకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆఫ్ఘన్ లో 18 ఏళ్లుగా ఉన్న అమెరికన్ సైనికుల ఉపసంహరణకు ఉద్దేశించి జరిగిన ఓ రహస్య సమావేశాన్ని ఆయన రద్దు చేశారు.