రోజాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జగన్..?

రోజా.. ఫైర్ బ్రాండ్‌కు మారు పేరు. వైసీపీ తరుఫున రెండు సార్లు నగిరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు.. సీఎం జగన్ కేబినెట్‌లో స్థానం దొరుకుతుందని చాలా మంది భావించారు. అయితే కొన్ని కారణాలతో తన కేబినెట్‌లో స్థానాన్ని కల్పించలేకపోయిన జగన్.. ఏపీఐఐసీ చైర్‌పర్సన్ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆమె కాస్త అసంతృప్తిని లోనైట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఓ వైపు రాజకీయాలను చూసుకుంటూనే మరోవైపు బుల్లితెరపైనా ఓ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. అంతేకాదు […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:12 pm, Tue, 24 September 19
రోజాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జగన్..?

రోజా.. ఫైర్ బ్రాండ్‌కు మారు పేరు. వైసీపీ తరుఫున రెండు సార్లు నగిరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు.. సీఎం జగన్ కేబినెట్‌లో స్థానం దొరుకుతుందని చాలా మంది భావించారు. అయితే కొన్ని కారణాలతో తన కేబినెట్‌లో స్థానాన్ని కల్పించలేకపోయిన జగన్.. ఏపీఐఐసీ చైర్‌పర్సన్ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆమె కాస్త అసంతృప్తిని లోనైట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఓ వైపు రాజకీయాలను చూసుకుంటూనే మరోవైపు బుల్లితెరపైనా ఓ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. అంతేకాదు రాజకీయంగా ఆమెకు బాధ్యతలు పెరిగినా.. ఆ షోను మాత్రం వదలడం లేదు. ఇక ఈ విషయంలోనే రోజాకు జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల సమాచారం.

షోను మానేసి.. బాధ్యతలను నిర్వర్తించాలని జగన్.. రోజాకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పరిపాలనలో తనదైన మార్క్‌ను చూపిస్తున్న జగన్.. తను అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించని మంత్రులు, ఎమ్మెల్యేలకు బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రోజా షోతో బిజీగా ఉండటం వల్ల ఏపీఐఐసీ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని భావించిన జగన్.. ఆమెకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా షోలు అవీ.. ఇవీ అంటే అస్సలు ఒప్పుకునే పరిస్థితే లేదనిఆయన  తేల్చి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు.. షోలు ముఖ్యమా.. పదవీ బాధ్యతలు ముఖ్యమా అని ఆయన ఒకింత ఆగ్రహానికి కూడా లోనైనట్లు టాక్. అసలే కొత్త రాష్ట్రం.. కంపెనీలు రాక నానా తంటాలు పడుతుండగా.. ఇలాంటి సమయంలో సపోర్ట్‌గా ఉండాలని ఆయన అన్నారట. మరి ఇందులో నిజమెంతో తెలీదు గానీ.. జగన్ స్వీట్ వార్నింగ్‌తో రోజా కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.