కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు.. రిలే నిరాహార దీక్షలతో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన..

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 23 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

  • uppula Raju
  • Publish Date - 5:51 am, Mon, 21 December 20
కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు.. రిలే నిరాహార దీక్షలతో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన..

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 23 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సింఘు సరిహద్దు వద్ద సోమవారం 11 మంది రైతులతో రిలే నిరాహార దీక్ష జరుగుతుందని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు.

హరియాణాలోని రహదారులపై ఈనెల 25 నుంచి 27 వరకు టోల్‌ ఫీజులను ఎవరూ చెల్లించకుండా అడ్డుకుంటామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత జగ్జీత్‌ సింగ్‌ దలేవాలా ప్రకటించారు. 27న ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగం ఇచ్చే సమయంలో అంతా పళ్లాలపై చప్పుడు చేస్తూ నిరసన తెలపాలని దేశ ప్రజలను కోరారు.ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడారు. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో చర్చలు మళ్లీ ప్రారంభిస్తారని ప్రకటించారు. నూతన చట్టాలపై రైతులు అనవసరంగా భ్రమ పడుతున్నారని నిశితంగా పరిశీలించిన తర్వాతనే వాటిని చట్ట రూపంలో తీసుకువచ్చామని తెలిపారు. డిసెంబర్ 25, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషిస్తారని బీజేపీ తెలిపింది.