అయ్యో రుక్మిణి..! వీళ్లు నన్ను బతకనివ్వరు.. చనిపోయే ముందు మహిళా కానిస్టేబుల్ ఏం చెప్పిందంటే..
ఒడిశా రాష్ట్రం నువాపాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ రుక్మిణి నాగ మృతి సంచలనం రేపింది. నువాపాడ రైల్వే స్టేషన్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని మరణించడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. అయితే చనిపోయే ముందు ఓ వీడియో రికార్డ్ చేసింది రుక్మిణి. ఆ వీడియోలో అత్తింటిపై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఒడిశా రాష్ట్రం నువాపాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ రుక్మిణి నాగ మృతి సంచలనం రేపింది. నువాపాడ రైల్వే స్టేషన్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని మరణించడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. అయితే చనిపోయే ముందు ఓ వీడియో రికార్డ్ చేసింది రుక్మిణి. ఆ వీడియోలో అత్తింటిపై తీవ్ర ఆరోపణలు చేసింది. చనిపోవాలనుకోవట్లేదు.. కానీ అత్త వేధింపులు తట్టుకోలేక చనిపోవాల్సి వస్తున్నట్లు చెప్పింది. అత్తింటివాళ్లు డబ్బుల కోసమే వస్తారు… ఇంటిని వదిలి వెళ్లిపోవాలని బలవంతం చేస్తారు.. కేవలం తనను మనీ మిషన్‌లాగే చూస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఏనాడూ సంతోషంగా లేనట్లు వీడియోలో కన్నీటి పర్యంతమైంది రుక్మిణి. ముఖ్యంగా, తన అత్త మాలతి సబర్ పేరు ప్రస్తావిస్తూ.. 2023లో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుండి ఆమెను క్రమం తప్పకుండా వేధింపులకు గురి చేశారని పేర్కొంది.
కన్నీళ్లు తెప్పిస్తున్న రుక్మిణి చెప్పిన మాటలు..
“నేను చనిపోవాలనుకోవట్లేదు. కానీ నాపై జరుగుతున్న నిరంతర వేధింపులు బతకనివ్వడం లేదు.. నా అత్తింటివాళ్లు డబ్బుల కోసమే వస్తారు. ఇంటిని వదిలి వెళ్లిపోవాలని నన్ను బలవంతం చేస్తారు. నేను, నా భర్త ప్రేమతో పెళ్లి చేసుకున్నాం. మొదట్లో మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత నా భర్త కుటుంబం ఒప్పుకోవడంతో కోర్టులో రిజిస్టర్ చేసుకున్నాం. మా అత్త మాలతి సబర్ మాతో ఉండకపోయినా, ఎప్పటికప్పుడు గొడవలు పెట్టేది. ఇబ్బందులు సృష్టించేది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వారు నన్ను పట్టించుకోలేదు. డబ్బులు అడగడానికి మాత్రమే వచ్చేవారు. నేను చనిపోవాలనుకోవట్లేదు. కానీ ఇంతటి వేధింపులను తట్టుకోలేకపోతున్నాను.” అంటూ రుక్మిణి ఆవేద వ్యక్తంచేసింది.
కేసు నమోదు..
ఇక సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రుక్మిణి రికార్డ్ చేసిన వీడియోను స్వాధీనం చేసుకుని.. అత్తింటి వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు రుక్మిణి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరారు. తమ బిడ్డ చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




