Odisha Results: కూలీ చేతిలో ఓడిపోయిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఇంతకీ లక్ష్మణ్ ఎవరు..?
ఓటమి ఎరగని నేతగా పేరున్న నవీన్ పట్నాయక్‌కు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయి. బిజూ జనతాదళ్ ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ భారీ మెజార్టీతో అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. అధికారం కోల్పోవడంతో పాటు ఓ సామాన్యుడి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్.

ఓటమి ఎరగని నేతగా పేరున్న నవీన్ పట్నాయక్‌కు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయి. బిజూ జనతాదళ్ ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ భారీ మెజార్టీతో అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. అధికారం కోల్పోవడంతో పాటు ఓ సామాన్యుడి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్.
నవీన్ పట్నాయక్ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో హింజాలి, కాంతాబంజి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. హింజాలిలో 4వేల పైచిలుకు ఓట్లతో గట్టెక్కారు. కానీ కాంతాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాజీ చేతిలో 16వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చవి చూశారు. ఒకప్పుడు బీజేపీ సపోర్ట్‌తో పవర్‌లోకి వచ్చిన నవీన్ పట్నాయక్, ఇప్పుడు బీజేపీతో విభేదించి అధికారాన్ని కోల్పోయారు. 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 78 స్థానాల్లో విజయదుందభి మోగిస్తే.. బీజేడీ 51 సీట్లు సాధించింది.ఇక లోకసభ ఫలితాల్లో ఊచకోతే. 21 ఎంపీ స్థానాల్లో బీజేపీ 20 సీట్లను దక్కించుకుంటే కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది.
ఒడిషాలో బీజేపీ సూపర్ విక్టరీ ప్రధాన కారణం.. మోదీ మానియా. ఒడిశాలో పర్యటించిన మోదీ సీఎం నవీన్ పట్నాయక్-ఆయన వ్యక్తిగత కార్యదర్శి వికే పాండ్యన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పూరీ జగన్నాథ ఆలయం సీక్రెట్ లాకర్ కీ తమిళనాడుకు తరలించెందెవరు ? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నిజాలను ప్రజల ముందుకు తెస్తామన్నారు. ఈ వ్యాఖ్యలు ఒడిశాలో బలంగా వ్యాపించాయి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద దెబ్బ కొట్టాయి.
బీజేపీ హవాతో బీజేడీకి గండిపడింది. ఇక కాంతాబంజిలో నవీన్ పట్నాయక్ ఘోర ఓటమి హాట్ టాపిక్‌గా మారింది. సీఎంను ఓడించిన సామాన్యుడిగా లక్ష్మన్ బాజీ ఎంతో పాపులరయ్యారు. 15 ఏళ్ల కిందట వరకు ఆయన ఓ సాధారణ దినసరి కూలీ. కార్మికుల పక్షాన పోరాడుతూ నాయకుడిగా ఎదిగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితాల్లో మూడో స్థానమే దక్కింది. 2019లో కేవలం 128 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. పరాజయానికి కుంగిపోకుండా పల్లె పల్లె తిరుగుతూ పట్టు పెంచుకున్నారు లక్ష్మణబాజీ. ప్రత్యర్థి ముఖ్యమంత్రి కావచ్చు..కానీ ఇక్కడి ప్రజల గుండెల్లో నేనే ముఖ్యం.. ప్రదాని మోదీపై వాళ్లకున్న నమ్మకమే తనను గెలిపించిందన్నారు లక్ష్మన్‌బాజీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




