AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దవాఖానలోని రోగులకు సర్జరీ చేసి ఇంజక్షన్ ఇచ్చారు.. కట్‌చేస్తే, నిమిషాల్లోనే ఆరుగురు విలవిలలాడుతూ..

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. మృతులంతా వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు. రోగులు గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దవాఖానలోని రోగులకు సర్జరీ చేసి ఇంజక్షన్ ఇచ్చారు.. కట్‌చేస్తే, నిమిషాల్లోనే ఆరుగురు విలవిలలాడుతూ..
Odisha's Koraput Tragedy
Gamidi Koteswara Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 05, 2025 | 9:43 AM

Share

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. మృతులంతా వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు. రోగులు గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరికి సర్జరీలు కూడా జరిగాయి. సర్జరీ కూడా విజయవంతం అయ్యింది. ఈ క్రమంలోనే ఆరుగురు రోగులకు ఒకే బ్యాచ్‌కి చెందిన ఇంజక్షన్లు ఇవ్వగా, వాటిని వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు. వెంటనే పరిస్థితి గమనించి ఐసీయూకు తరలించినా ప్రాణాలు నిలుపలేకపోయారు. విషయ తీవ్రతను గమనించిన ఆసుపత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు మరణించిన ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సంబంధిత ఇంజక్షన్ బ్యాచ్‌ను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతానికి ఉన్నతాధికారులు ఆసుపత్రి డాక్టర్లు, నర్సుల్ని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, మృతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మృతిచెందారని బంధువులు ఆందోళనకు దిగారు.

అధికారులు మృతుల బంధువులతో సంప్రదింపులు జరిపి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పది మంది వైద్య బృందం పోస్ట్ మార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల మోహరింపు..

పరిస్థితిని నియంత్రించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు సిబ్బందిని మోహరించారు. ఆసుపత్రి న్యాయమైన విచారణకు హామీ ఇచ్చినప్పటికీ, ఈ సంఘటన ఒడిశాలో ప్రజారోగ్య సంరక్షణ గురించి చాలా కాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. దక్షిణ ఒడిశాకు కీలకమైన వైద్య సదుపాయమైన SLNMCH, సిబ్బంది కొరత, అస్థిరమైన వైద్య విధానాలు, సరిపోని మౌలిక సదుపాయాలపై గతంలో విమర్శలను ఎదుర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..