‘ ఇస్కాన్ ‘ రథయాత్రకు హాజరవుతా… నుస్రత్ జహాన్

ఇటీవల తన ‘ హిందూ పోకడ ‘తో ముస్లిం మత గురువుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్న బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ వారికి మరో షాక్ ఇచ్చింది. (ఈమెకు ముస్లిం మతగురువులు ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే). కోల్ కతా లో ఈ నెల 4 న ‘ ఇస్కాన్ ‘ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం) నిర్వహించనున్న రథయాత్ర ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా హజరవుతానని నుస్రత్ జహాన్ ప్రకటించింది. […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:21 pm, Tue, 2 July 19
' ఇస్కాన్ ' రథయాత్రకు హాజరవుతా... నుస్రత్ జహాన్

ఇటీవల తన ‘ హిందూ పోకడ ‘తో ముస్లిం మత గురువుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్న బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ వారికి మరో షాక్ ఇచ్చింది. (ఈమెకు ముస్లిం మతగురువులు ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే). కోల్ కతా లో ఈ నెల 4 న ‘ ఇస్కాన్ ‘ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం) నిర్వహించనున్న రథయాత్ర ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా హజరవుతానని నుస్రత్ జహాన్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వాహకుల ఆహ్వానాన్ని ఆమె అంగీకరించింది. ఇందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఆమె నిజంగా మంచి మార్గాన్ని అనుసరించిందని పొగడ్తలతో ముంచెత్తారు.

1971 నుంచి ‘ ఇస్కాన్ ‘ సంస్థ.. కృష్ణ, బలరామ, సుభద్ర విగ్రహాలతో భారీ ఎత్తున రథయాత్రను నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా జరగబోయేది 48 వ రథయాత్ర. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రథయాత్రను ప్రారంభించనున్నారు. కాగా-పార్లమెంటులో నుస్రత్..నుదుట బొట్టు, మెడలో మంగళసూత్రం, చేతులకు గాజులు ధరించి కనిపించినందుకు ముస్లిం మత గురువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారి ఆరోపణను, ఫత్వాను ఖండించిన ఆమె.. తాను ఇప్పటికీ ముస్లిమునేనని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని, అన్ని మతాలూ తనకు సమానమేనని కౌంటరిచ్చింది. కోల్ కతాకు చెందిన ఓ బిజినెస్ మన్ ని నుస్రత్ ఇటీవలే వివాహం చేసుకుంది.