AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజల సొమ్ముతో విదేశీ పర్యటనలు,విలాసాలు.. బెంగాల్ ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ ఫైర్..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలి విదేశీ పర్యటన విహారయాత్ర తప్ప మరొకటి కాదని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే సాకుతో పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. పర్యటన సందర్భంగా, బెనర్జీ ఒక హోటల్‌లో బస చేశారని, అక్కడ బసకు రోజుకు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజల సొమ్ముతో విదేశీ పర్యటనలు,విలాసాలు.. బెంగాల్ ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ ఫైర్..
Adhir Ranjan Slams Mamata
Sanjay Kasula
|

Updated on: Sep 28, 2023 | 3:14 PM

Share

అప్పుడే ఇండియా కూటమి బీటలు వారుతోంది. మేంతా ఒక్కటే అంటూ 26 పార్టీలు పెద్ద ఎత్తున షో చేసిన సంగతి మరిచిపోకముందే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. జాతీయ స్థాయిలో మేమంతా ఒకటే అంటూనే.. రాష్ట్రాల్లో మాత్రం ఎడమొహం.. పెడమొహంలా విమర్శిలు చేసుకుంటున్నారు. అంతే కాదు.. కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా విదేశీ పర్యటన నుంచి తిగిరి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి టార్గెట్ చేశారు. మమత ఇటీవలి విదేశీ పర్యటనపై ప్రశ్నలను లేవనెత్తారు అధిర్. ప్రజలు కట్టిన సొమ్ముని దుర్వినియోగం చేశారని.. విదేశాల్లో సరదాగా గడిపి తిరిగి వచ్చారంటూ మండిపడ్డారు.

మమతా బెనర్జీ విదేశీ పర్యటన సందర్భంగా బస చేసిన హోటల్‌లో బస చేసేందుకు రోజుకు రూ.3 లక్షలు ఖర్చవుతుందని అధిర్ రంజన్ పేర్కొన్నారు. బెంగాల్‌లో పెట్టుబడులను సేకరించేందుకు మమతా బెనర్జీ స్పెయిన్, దుబాయ్‌లలో 12 రోజులపాటు పర్యటనకు వెళ్లారు. ఆమె సెప్టెంబర్ 23న కోల్‌కతాకు తిరిగి వచ్చారు.

బుధవారం అధీర్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ మమతా విదేశీ పర్యటనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి హోటల్ లో బస చేయడం చూశామని, అందులో రోజు అద్దె రూ.3 లక్షలు అని అన్నారు.‘ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే కాదు.. చాలా మంది ప్రమోటర్లు కూడా మన రాష్ట్ర సొమ్మును దుర్వినియోగం చేశారు.. పెట్టుబడులు తెస్తామనే పేరుతో స్పెయిన్‌కు వెళ్లి సరదాగా గడిపి వచ్చారు..’ అని అధీర్‌రంజన్‌ అన్నారు.”

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు భారీగా ఖర్చు చేశారని, విదేశీ పర్యటనల నుంచి  బెంగాల్‌ రాష్ట్రానికి వారు తెచ్చింది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇంత వరకు ఒక్క పరిశ్రమ ఇక్కడి రాలేదని, ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురాలేదని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

10 రోజులు బెడ్ రెస్ట్‌లో..

విదేశీ పర్యటనలో మమతా ఎడమ మోకాలి గాయం అయ్యింది.. ఈ ఘటనను అధీర్‌రంజన్‌ ఎగతాళి చేస్తూ, “ఆమె త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, తద్వారా ఆమెకు మళ్లీ అబద్ధాలు చెప్పే అవకాశాలు లభిస్తాయి” అని ఎద్దేవ చేశారు.

ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు 10 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. జూన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా.. ఎయిర్‌బేస్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసిన హెలికాప్టర్ నుంచి దిగుతున్నప్పుడు ఆమె మోకాలికి గాయం అయిన సంగతి తెలిసిందే.

మమత విదేశీ పర్యటనతో రాష్ట్రానికి ఏం వచ్చిందంటే..

యువ ప్రతిభను పెంపొందించడం కోసం రాష్ట్రంలో అకాడమీని ఏర్పాటు చేసేందుకు స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తరువాత దుబాయ్‌లో, బహుళజాతి సమ్మేళనం లులు ఇంటర్నేషనల్ గ్రూప్ అధికారులతో మమతా సమావేశమయ్యారు. వారు చేపలు, మాంసం ప్రాసెసింగ్, పౌల్ట్రీ, డైరీ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో మమతకు డెంగ్యూ: అధిర్ రంజన్

బెంగాల్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసుల గురించి గతంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇది ‘మమత మేడ్ డెంగ్యూ’ అని అన్నారు. డెంగ్యూ అనేది మ్యాన్ మేడ్ డెంగ్యూ అని అధీర్ గత మంగళవారం విమర్శించారు. ఇంకా చెప్పాలంటే మమత చేసిన డెంగ్యూ. దేవుడి దయతో దీదీ బెంగాల్ ప్రజలను విడిచిపెట్టారని విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం