Winter: గజగజలాడిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు..

చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో.. చలి, పొగమంచు దట్టగా కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగుతుందని...

Winter: గజగజలాడిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు..
Winter
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 28, 2022 | 6:41 AM

దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో.. చలి, పొగమంచు దట్టగా కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 28 న హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ యూపీలో దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 3 నుంటి 4 రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని సికార్‌లో చలిగాలుల పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా నగరంలో ఉష్ణోగ్రతలు మైనస్‌లో నమోదవుతున్నాయి. ఈ ఏడాది చివరి రెండు రోజుల్లో చలికాలంలో కాస్త ఉపశమనం లభించినా.. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే మళ్లీ చలిగాలులు వీస్తాయి. ఇంతలో మంగళవారం దేశ రాజధానిలో చాలా చల్లని రోజు నమోదైంది. ఢిల్లీ కనిష్ట ఉష్ణోగ్రత డెహ్రాడూన్, ధర్మశాల, నైనిటాల్ కంటే దిగువకు చేరుకుంది.

మంగళవారం ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌ సహా వాయువ్య భారతదేశంలోని విస్తృత ప్రాంతాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. ఢిల్లీలో విజిబిలిటీ కేవలం 50 మీటర్లకు పడిపోయింది. దీంతో రోడ్డు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, రెండింటిని రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. డెహ్రాడూన్‌లో ఏడు డిగ్రీల సెల్సియస్, ధర్మశాలలో 6.2 డిగ్రీల సెల్సియస్, నైనిటాల్‌లో 7.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు.. పంజాబ్‌లోని భటిండాలో 1.4 డిగ్రీల సెల్సియస్, అమృత్‌సర్‌లో ఐదు డిగ్రీలు, లూథియానాలో 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్తాన్‌లో తీవ్రమైన చలి కాలం కొనసాగుతోంది. కశ్మీర్ కూడా చలిగాలుల గ్రిప్‌లో చిక్కుకుంది. మొత్తం లోయలో ఉష్ణోగ్రత అనేక డిగ్రీల సెల్సియస్‌లు పడిపోయింది. పాదరసం సున్నా కంటే దిగువకు పడిపోయింది. ఆదివారం రాత్రితో పోలిస్తే సోమవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత ఒకటి నుంచి రెండు డిగ్రీలు తగ్గినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!