AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT 2024: ‘భారత్‌ను ఆటపట్టిస్తే.. వదిలిపెట్టేది లేదు’ టీవీ9 సమ్మిట్ వేదికగా ఇతర దేశాలకు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ మూడో రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారతదేశాన్ని తక్కువ అంచనా వేసి.. ఆటపట్టించే ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

WITT 2024: 'భారత్‌ను ఆటపట్టిస్తే.. వదిలిపెట్టేది లేదు' టీవీ9 సమ్మిట్ వేదికగా ఇతర దేశాలకు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..
Rajnath Singh
Ravi Kiran
|

Updated on: Feb 27, 2024 | 1:22 PM

Share

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ మూడో రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారతదేశాన్ని తక్కువ అంచనా వేసి.. ఆటపట్టించే ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పుల్వామా, డోక్లాం సంఘటనలకు భారత్ తగిన సమాధానం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మేము ఇతర దేశాలకు భారత్ రక్షణ విధానం, విదేశాంగ విధానం ఏంటన్నది క్లియర్‌గా స్పష్టం చేశాం. భారత్‌ సయోధ్యకి వస్తే సరి కానీ.. కాదని కయ్యానికి కాలు దువ్వుతే విడిచిపెట్టేది లేదన్నారు రాజ్‌నాథ్ సింగ్.

ఇప్పటిదాకా భారత్ ఏ దేశంపైనా దాడి చేయలేదు..

‘ఏ దేశంతోనైనా భారత్ సయోధ్యకే వెళ్లాలని చూస్తుంది. కయ్యానికి కాలు దువ్వదు. అలా కాదని ఎవరైనా భారతదేశాన్ని ఆటపట్టిస్తే.. వదిలిపెట్టేది లేదు. ఇప్పటివరకు ఏ దేశంపైనా భారత్ దాడి చేయలేదు. వేరే దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకొని ఏకైక దేశం భారత్. దాడులు చేసి ఇతర దేశాల భూమిని ఆక్రమించుకున్న ప్రపంచదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ అంశంపై భారత్ గురించి ఎవ్వరూ ఏం మాట్లాడరు’ అని రాజ్‌నాథ్ అన్నారు.

చైనాతో సత్సంబంధాలపై చర్చలు.!

చైనా అంశంపై ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘సత్సంబంధాలపై చర్చలు సాగుతున్నాయి. చింతించాల్సిన అవసరం ఏం లేదు. ఏయే అంశాలపై చర్చలు సాగుతున్నాయోనన్న దాని గురించి ఈ వేదికపై మాట్లాడలేను’ అని అన్నారు.

దేశాన్ని ఎవ్వరికీ తలవంచనివ్వం..

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవ్వరికీ తలవంచనివ్వమని గట్టి విశ్వాసంతో చెప్పారు రాజ్‌నాథ్ సింగ్. చైనాతో ఎప్పుడూ రాజీపడబోమని.. దాడుల చేసి చర్చలు జరపాలని అనుకోవట్లేదని అన్నారు. చైనా కూడా భారత్‌తో చర్చలకు సిద్దంగా ఉంది కాబట్టి.. ఇరు దేశాల మధ్య సయోధ్యకు చర్చలు జరుగుతున్నాయన్నారు రాజ్‌నాథ్ సింగ్.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి