Puducherry Political Crisis: పుదుచ్చేరి సంక్షోభం, పార్టీలో గుర్తింపు లేదు, అందుకే రాజీనామా చేశా ! లక్ష్మీనారాయణన్
పుదుచ్చేరి రాజకీయ సంక్షోభంలో మరో మలుపు.. కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని, అందువల్ల పార్టీ నుంచి వైదొలగుతున్నానని నాలుగు సార్లు..
Puducherry Political Crisis: పుదుచ్చేరి రాజకీయ సంక్షోభంలో మరో మలుపు.. కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని, అందువల్ల పార్టీ నుంచి వైదొలగుతున్నానని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మీనారాయణన్ అన్నారు. తను సీనియర్ నాయకుడినని, కానీ తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. పాలక కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, కానీ ఇందుకు తనను మాత్రం విమర్శించవద్దని ఆయన అన్నారు. తన సహచరులతో చర్చించి నా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటానని లక్ష్మీనారాయణన్ చెప్పారు.
అయితే ఇంత జరిగినా సీఎం నారాయణస్వామి మాత్రం సోమవారం శాసన సభలో తన బలాన్ని నిరూపించుకోగలననే ధీమాతో ఉన్నారు. నా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోను అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని కూల్చేందుకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓ అలవాటుగా మార్చుకుందని ఆయన ఆరోపించారు.
డీఎంకె నుంచి మరో ఎమ్మెల్యే రాజీనామా
పుదుచ్చేరిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణన్ రాజీనామా చేయగా..కొద్దిసేపటికే ఈ పార్టీ మిత్ర పక్షమైన డీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే రిజైన్ చేశారు. దీంతో అసెంబ్లీలో మొత్తం 26 మంది సభ్యులకు గాను ప్రభుత్వ బలం 12కి పడిపోయింది.
Also Read: