Andhra Odisha Border: మావోయిస్టుల దుశ్చర్య.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రెచ్చిపోయిన మావోలు.. జవాన్‌కు గాయాలు

Andhra Odisha Border: ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు..ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. ఈ ఘటనలో...

Andhra Odisha Border: మావోయిస్టుల దుశ్చర్య.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రెచ్చిపోయిన మావోలు.. జవాన్‌కు గాయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 21, 2021 | 4:11 PM

Andhra Odisha Border: ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు..ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌కు గాయాలయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లా దాల్‌దాలీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఏవోబీలో మావోయిస్టులు ఇలాంటి ఎన్నో ఘటనలకు పాల్పడ్డారు. ఈ సరిహద్దులో అధికంగా సంచరించే మావోయిస్టులు.. వారి కోసం భద్రతా బలగాలు ప్రతినిత్యం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

కాగా, మావోలు ఈ ల్యాండ్‌మైన్‌ పేల్చివేయడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. మావోయిస్టుల కోసం ఏవోబీలో గాలింపు చర్యలు చేపట్టాయి.

Also Read: Bird Flu: మనుషులకు సోకుతున్న బర్డ్‌ ఫ్లూ.. ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా..? రష్యా పరిశోధకులు ఏమంటున్నారు..?