మళ్ళీ మొదటికి..పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు..సిద్దు క్షమాపణ కోరాల్సిందేనంటున్న సీఎం అమరేందర్ సింగ్ వర్గం

పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముగిసినట్టే కనిపించినా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ కొత్త చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సిద్దు సోషల్ మీడియాలో తనపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పేంతవరకు అమరేందర్ సింగ్...

మళ్ళీ మొదటికి..పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు..సిద్దు క్షమాపణ కోరాల్సిందేనంటున్న సీఎం అమరేందర్ సింగ్ వర్గం
No Compromise Between Punjab Cm Amarendar Singh And Navajot Singh Sidhu
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 21, 2021 | 8:58 AM

పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముగిసినట్టే కనిపించినా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ కొత్త చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సిద్దు సోషల్ మీడియాలో తనపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పేంతవరకు అమరేందర్ సింగ్ ఆయనతో భేటీ కాబోరని సింగ్ వర్గం సభ్యుడొకరు ట్వీట్ చేశారు. కొత్త పదవిలో తనను నియమించిన అనంతరం సిద్దు..సింగ్ ని వ్యవధి కోరారని వచ్చిన వార్తలను రవీన్ తుక్రాల్ అనే ఈ సభ్యుడు తోసిపుచ్చారు. అమరేందర్ సింగ్ పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలకు సిద్దు బహిరంగంగా సారీ చెప్పాలని, అంతవరకూ వీరి మధ్య సమావేశం జరిగే అవకాశాలు లేవని ఆయన వెల్లడించారు. సింగ్, సిద్దు మధ్య ఇంకా ఇలా రగడ కొనసాగడం కాంగ్రెస్ హైకమాండ్ కి తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఇద్దరూ కలిసిపోతారని, రాష్ట్ర పార్టీ శాఖలో ఇక ఏ గొడవలూ ఉండబోవని ఆశించిన అధిష్టానానికి ఆశాభంగమే కలిగింది. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని సిద్దు ఆశించినప్పటికీ అలా జరగలేదు. అటు ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమించడాన్ని అమరేందర్ సింగ్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇన్నాళ్లుగా వీరు ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు, పార్టీ నేతలు వీరికి సూచించిన రాజీ ఫార్ములా ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఇక సిద్దు కూడా అమరేందర్ సింగ్ కి సారీ చెప్పేస్థితిలో లేరు. ఈయన నియామకంపై సింగ్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పార్టీ హైకమాండ్ కి లేఖ రాశారు. మొత్తానికి వీరి మధ్య సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కుదిర్చిన రాజీ ఫార్ములా తుస్సుమంది.

మరిన్ని ఇక్కడ చూడండి : Rains In Hyderabad Video: చినుకుతో భాగ్యనగరం వణుకు..!మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..(వీడియో).

 Bigg Boss 5 Video: 100% గ్లామర్… బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్ లిస్ట్ లీక్..ఈ సరి మరింత ఆసక్తికరంగా…

 మోదీ ఫొటోకు వంగి వంగి దణ్ణాలు పెడుతున్నారు.ఎందుకో..?ఎక్కడో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో..:Punch to PM Modi video.

 Gold Price video: మరోసారి పసిడి పరుగులు..మళ్ళి పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా.. (వీడియో)