నిర్భయ కేసులో షాకింగ్ ట్విస్ట్.. దోషుల ఉరిపై స్టే
తమ ఉరిశిక్షపై స్టే జారీ చేయాలని కోరుతూ నిర్భయ దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు అనుమతించింది. దీంతో ఫిబ్రవరి 1 న వీరికి అమలుపరచవలసిన ఉరిశిక్షను.. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు వాయిదా వేశారు. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తీర్పునిచ్చారు. దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. వీరి ఉరితీతను నిరవధికంగా వాయిదా వేయాలని కోరారు. వినయ్ […]
తమ ఉరిశిక్షపై స్టే జారీ చేయాలని కోరుతూ నిర్భయ దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు అనుమతించింది. దీంతో ఫిబ్రవరి 1 న వీరికి అమలుపరచవలసిన ఉరిశిక్షను.. తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు వాయిదా వేశారు. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తీర్పునిచ్చారు. దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. వీరి ఉరితీతను నిరవధికంగా వాయిదా వేయాలని కోరారు. వినయ్ మెర్సీ పిటిషన్ ఇంకా రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉందని ఆయన అన్నారు. కాగా-ఒక దోషి పిటిషన్ మాత్రమే పెండింగులో ఉందని, ఇతర దోషులను ఉరి తీయవచ్చునని తీహార్ జైలు అధికారుల తరఫు అడ్వొకేట్ వాదించారు. తమ ఉరిపై స్టే విధించాలన్న ముగ్గురు దోషుల పిటిషన్‌ను ఆయన సవాలు చేశారు. కానీ…. ఈ వాదనతో సింగ్ విభేదిస్తూ.. ఒక్క దోషి అభ్యర్థన పెండింగులో ఉన్నా.. ఇతర దోషులను ఉరి తీయజాలరన్న నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక మరో దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి జనవరి 17 న కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ.. ముకేశ్ వేసిన అప్పీలును సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. అటు-వినయ్, అక్షయ్‌ల క్యురేటివ్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయగా.. పవన్ గుప్తా మాత్రం క్యురేటివ్ పిటిషన్ వేయలేదు. నేరం జరిగినప్పుడు తాను మైనర్‌నన్న అతని అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.
ఇదిలా ఉండగా.. ఈ నలుగురి ఉరిపై కోర్టు స్టే ఇవ్వడంపట్ల నిర్భయ తల్లి తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే వీరి ఉరి ఒకసారి వాయిదా పడిందని, ఫిబ్రవరి 1 న వీరికి మరణశిక్ష విధించాల్సి ఉండగా మళ్ళీ వాయిదా వేయడమేమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు.