నిర్భయ దోషి పవన్ పిటిషన్ కొట్టివేత
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా… నేరం జరిగినప్పుడు తను మైనర్ నని, అందువల్ల తన శిక్షాకాలాన్ని తగ్గించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండు వారాల్లో అతని పిటిషన్ ని కోర్టు కొట్టివేయడం ఇది రెండో సారి. మైనర్ అయిన తన శిక్షాకాలాన్ని తగ్గించాలన్న అతని కోర్కెను గతంలో కోర్టు తిరస్కరించగా.. దాన్ని సవాలు చేస్తూ మళ్ళీ పవన్ సుప్రీంకోర్టుకెక్కాడు. అయితే ఒకసారి తిరస్కరణకు గురైన తరువాత మాటిమాటికీ దాన్ని సవాలు […]
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా… నేరం జరిగినప్పుడు తను మైనర్ నని, అందువల్ల తన శిక్షాకాలాన్ని తగ్గించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండు వారాల్లో అతని పిటిషన్ ని కోర్టు కొట్టివేయడం ఇది రెండో సారి. మైనర్ అయిన తన శిక్షాకాలాన్ని తగ్గించాలన్న అతని కోర్కెను గతంలో కోర్టు తిరస్కరించగా.. దాన్ని సవాలు చేస్తూ మళ్ళీ పవన్ సుప్రీంకోర్టుకెక్కాడు.
అయితే ఒకసారి తిరస్కరణకు గురైన తరువాత మాటిమాటికీ దాన్ని సవాలు చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శనివారం ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీయాల్సి ఉంది. తమ శిక్షను వాయిదా వేసేందుకు వీరు పలు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా-వీరిని ఉరి తీసేందుకు మీరట్ తలారి పవన్ జల్లాద్ గురువారమే తీహార్ జైలుకు చేరుకున్నాడు. ఈ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయవచ్చుననే వార్తలు జోరందుకుంటున్నాయి.