కరోనా కల్లోలం..భారత్‌ అప్రమత్తం

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనాలో బయటపడ్డ ఈ ప్రాణాంతక మహమ్మారి..ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. దీంతో భారత్‌ మరింత అప్రమత్తమైంది. ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేసింది. మరోవైపు మనదేశంలో రెండో కరోనా కేసు నమోదైనట్లు వార్తలొస్తున్నాయి. నిన్న మొదటి కేసు కేరళలో బయటపడగా… ఇవాళ చెన్నైలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. […]

కరోనా కల్లోలం..భారత్‌ అప్రమత్తం
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jan 31, 2020 | 5:38 PM

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనాలో బయటపడ్డ ఈ ప్రాణాంతక మహమ్మారి..ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. దీంతో భారత్‌ మరింత అప్రమత్తమైంది. ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేసింది.

మరోవైపు మనదేశంలో రెండో కరోనా కేసు నమోదైనట్లు వార్తలొస్తున్నాయి. నిన్న మొదటి కేసు కేరళలో బయటపడగా… ఇవాళ చెన్నైలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. హాంకాంగ్‌ నుంచి చెన్నై వచ్చిన మహిళకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం మొదలైంది. కాకినాడలో కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ వ్యక్తిని హాస్పిటల్‌లో అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఈనెల 16న ఊహాన్‌ నుంచి విద్యార్థి మహ్మద్‌ ఇమ్రాన్‌ కాకినాడ వచ్చారు. కరోనా లక్షణాలు ఉండొచ్చన్న అనుమానంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఐతే అతనికి వైరస్‌ లేదని తేలింది. ఇక కాకినాడ, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల్లో మెడికల్‌ క్యాంప్స్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యశాఖాధికారులు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.