లొట్టిపిట్టపై ఊరేగుతూ పెళ్లికొడుకు వినూత్న నిరసన
కేరళలోని తిరువనంతపురంలో ఓ పెళ్లి కొడుకు చేపట్టిన వినూత్న నిరసన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.. కేరళకు చెందిన హజా హుస్సేన్ అనే వ్యాపారికి పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏ, జాతీయ పౌర పట్టిక- ఎన్‌ఆర్‌సీలకు తీవ్ర వ్యతిరేకి… సోమవారం ఆయనకు పెళ్లి జరిగింది.. ఈ సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబైన హజా హుస్సేన్ తిరువనంతపురం నుంచి వాజిముక్కు అంటే పెళ్లి జరిగే ప్రాంతం వరకు దాదాపు 20 కిలోమీటర్లు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు.. ఇందులో గొప్పేముందనుకుంటున్నారేమో… […]
కేరళలోని తిరువనంతపురంలో ఓ పెళ్లి కొడుకు చేపట్టిన వినూత్న నిరసన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.. కేరళకు చెందిన హజా హుస్సేన్ అనే వ్యాపారికి పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏ, జాతీయ పౌర పట్టిక- ఎన్‌ఆర్‌సీలకు తీవ్ర వ్యతిరేకి… సోమవారం ఆయనకు పెళ్లి జరిగింది.. ఈ సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబైన హజా హుస్సేన్ తిరువనంతపురం నుంచి వాజిముక్కు అంటే పెళ్లి జరిగే ప్రాంతం వరకు దాదాపు 20 కిలోమీటర్లు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు.. ఇందులో గొప్పేముందనుకుంటున్నారేమో… లొట్టిపిట్టపై ఊరేగుతూ సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిద్దాం అన్న ప్లకార్డును పట్టుకుని నిరసన తెలిపాడు.. మరి ఇది గొప్పేకదా! ఈయనతో పాటుగా బంధువులు, స్నేహితులు అందరూ ఊరేగింపుగా వెళ్లారు.. దీంతో రోడ్డుమీద కొంచెం రద్దీ కనిపించింది.. చూసినవాళ్లలో కొందరు ముచ్చటపడ్డారు.. కొందరు ముక్కున వేలేసుకున్నారు.. ఎందుకిలా అని హుస్సేన్‌ను అడిగితే.. సీఏఏపై తనకున్న వ్యతిరేకతను ప్రదర్శించాలి కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని పెళ్లి కొడుకు గెటప్‌లోనే అన్సరిచ్చాడు.. పైగా ఈ చట్టాన్ని నిషేధించాలని కేంద్రాన్ని కోరాడు.. అన్నట్టు హుస్సేన్ మరో గొప్ప పని కూడా చేశాడండొయ్… తన భార్యకు కట్నకానుకలతో పాటుగా ఓ రాజ్యాంగం ప్రతిని కూడా బహుమతిగా అందించాడు..