కేంద్రం తెచ్చిన చట్టం.. మా రూటే సెపరేటంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు.. !

మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వెహికిల్ చట్టానికి మెరుగులుదిద్దింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసిన కేంద్ర.. వాహనాదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించేలా చట్టం తీసుకొచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. మెజార్టీ ప్రజలు ఈ నూతన చట్టంపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వాలు […]

కేంద్రం తెచ్చిన చట్టం.. మా రూటే సెపరేటంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు.. !
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 12, 2019 | 5:18 PM

మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వెహికిల్ చట్టానికి మెరుగులుదిద్దింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసిన కేంద్ర.. వాహనాదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించేలా చట్టం తీసుకొచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. మెజార్టీ ప్రజలు ఈ నూతన చట్టంపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వాలు ఖజానా నింపుకునేందుకే ఇలా పెనాల్టీలను పెంచిందంటూ.. వాహనదారులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఇప్పటికే పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇంకా ఈ చట్టాన్ని అమలు చేయలేదు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కొత్త మోటార్ వెహికిల్ యాక్ట్ బాగానే ఉందంటున్నా.. రాష్ట్రంలో మాత్రం ఇంకా అమలు చేయలేదు. అయితే ఇప్పుడు కేంద్రం తెచ్చిన ఈ చట్టాన్ని అమలు పరిచేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలే వెనకడుగు వేస్తున్నాయి. దీంతో కేంద్రం తెచ్చిన చట్టంపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త మోటార్ వెహికిల్ చట్టంపై కేంద్రం పునరాలోచించకపోతే, తామే జరిమానాలు తగ్గిస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలే ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న జరిమానాలు ప్రజల మీద భారం పెంచుతున్నాయని అభిప్రాయపడ్డాయి. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ, ఢిల్లీ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా,వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ఈ జరిమానాల అంశాన్ని తిప్పి కొట్టిన విషయం విధితమే.

కేంద్ర తెచ్చిన చట్టంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా పెనాల్టీలు విధించాల్సి వస్తోంది. పెనాల్టీలను తగ్గించే అంశంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. రాష్ట్రాలే జరిమానాల ధరలను సవరించుకుంటున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించింది. కేంద్ర తెచ్చిన పెనాల్టీలను సగానికి పైగా తగ్గించాయి. కొత్త చట్టం ప్రకారం హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. రూ.1000/- ఉన్న పెనాల్టీని రూ.500/-కు తగ్గించింది. ఇలా దాదాపు అన్ని రకాల పెనాల్టీలను సగానికి పైగా తగ్గించింది గుజరాత్ ప్రభుత్వం. కొత్త మోటార్ చట్టంలో ఉన్న ధరలను సగానికి తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ అధికారికంగా ప్రకటించారు. అయితే అంతకు ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. మరోసారి ధరల తగ్గింపును సమీక్షించుకొండి అన్న గడ్కరీ వ్యాఖ్యలను విజయ్ రూపానీ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఇదే కోవలోకి మరో రాష్ట్రం చేరుతోంది. గుజరాత్ తరహాలో కర్ణాటకలో కూడా పెనాల్టీలను తగ్గించేందుకు సీఎం యడియూరప్ప రవాణా శాఖ అధికారులతో చర్చలు జరిపారు. కొత్త చట్టంలోని పెనాల్టీలను సగానికి తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయడం లేదు.

అయితే ప్రతిపక్ష పాలిత రాజస్థాన్‌లో హెల్మెట్ ధరించకపోతే రూ.1000/- వసూలు చూస్తూ.. హెల్మెట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడ వాహనాలపై కులం, వర్గం పేరుతో రాతలు రాస్తే కూడా పెనాల్టీలను విధిస్తున్నారు. అయితే వాహనదారులకు నిబంధనల పట్ల అవగాహన వచ్చే వరకు కొత్త చట్టాన్ని అమలు చేయమని అధికారులు అంటున్నారు. ఇక ఒడిషాలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే.. రూ.500/- పెనాల్టీతో హెల్మెట్‌ను ఉచితంగా ఇస్తున్నారు. కొత్త చట్టాన్ని మరో మూడు నెలల వరకు అమలు చేయమని ఒడిషా ప్రభుత్వం తేల్చిచెప్పింది. అటు ఢిల్లీ, పంజాబ్‌, కేరళ రాష్ట్రాలు కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాహటంగానే ఈ జరిమానాల అంశాన్ని తిప్పికొట్టింది.

అయితే కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గిస్తే రాష్ట్రాలే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలు తగ్గిస్తే.. దానికి సంబంధించి ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలన్నారు. వాహనదారుల దగ్గర నుంచి జరిమానాలు విధించి డబ్బు రాబట్టడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కాదని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఏది ఎమైనా కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన మోటార్ వెహికిల్ చట్టాన్ని సొంత బీజేపీ పాలిత రాష్ట్రాలే భిన్నాభిప్రాయాలను తెలుపుతుండటంతో కేంద్రం తెచ్చిన చట్టంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.