AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Variant jn-1: ఒమిక్రాన్ తమ్ముడు జెఎన్1 తో ఆందోళన అవసరం లేదంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ

భారత దేశంలో కొత్త కరోనా కేసులు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 బారినపడి వారిలో 21 కేసులు నిర్ధారణ అయ్యాయి. విదేశాల్లో ప్రారంభమైన సబ్ వేరియంట్ JN.1 క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది.

Corona Variant jn-1: ఒమిక్రాన్ తమ్ముడు జెఎన్1 తో ఆందోళన అవసరం లేదంటున్న కేంద్ర ఆరోగ్య శాఖ
Corona Virus
Balaraju Goud
|

Updated on: Dec 20, 2023 | 5:33 PM

Share

భారత దేశంలో కొత్త కరోనా కేసులు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 బారినపడి వారిలో 21 కేసులు నిర్ధారణ అయ్యాయి. విదేశాల్లో ప్రారంభమైన సబ్ వేరియంట్ JN.1 క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. తొలుత మొదటి కేసు ఆగస్టులో లక్సెంబర్గ్‌లో గుర్తించారు వైద్యులు. క్రమంగా 36 నుంచి 40 దేశాలకు విస్తరించింది కొత్త వేరియంట్.

కరోనా వైరస్ పాండమిక్‌లో ఆఖరిగా ఓమిక్రాన్ వేరియంటు వచ్చింది.. అది BA 2.86.. దానికి కొన్ని మార్పులు కలిగి ఇప్పుడు JN.1 (BA 2.86.1.1) అనేది పుట్టుకొచ్చింది.. మొదట లక్సెంబర్గ్‌లో కనిపించి తర్వాత యూరప్ అమెరికా మిగతా కంట్రీలో విస్తరించింది.. మన దేశంలో తొలుత కేరళలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. క్రమంలో దేశవ్యాప్తంగా మెల్ల మెల్లగావిస్తరిస్తోంది. డిసెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా 500 కరోనా కేసులు నమోదయ్యాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. గత రెండు వారాల్లో కోవిడ్ కారణంగా 16 మంది మరణించారు. ఈ వ్యక్తులకు ఇప్పటికే చాలా తీవ్రమైన వ్యాధులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 2300 యాక్టివ్ కేసులలో కరోనా, 21 సబ్-వేరియంట్ JN.1 కేసులు ఉన్నాయి. కొత్త వేరియంట్‌తో భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

గత 24 గంటల్లో కేరళలో 292, తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, తెలంగాణ, పుదుచ్చేరిలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్‌లలో 3 కేసులు, పంజాబ్, గోవాలలో ఒక కేసు నమోదయ్యాయి. ఇదిలావుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా వైరస్ ‘JN.1’ సబ్-వేరియంట్‌ను ‘ఆసక్తి వేరియంట్’గా ప్రకటించింది. ఇది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు ఉండదని స్పష్టం చేసింది.

కరోనా వైరస్ పాండమిక్ లో ఆఖరిగా ఓమిక్రాన్ వేరియంటు వచ్చింది.. అది BA 2.86.. దానికి కొన్ని మార్పులు కలిగి ఇప్పుడు JN.1 (BA 2.86.1.1) అనేది పుట్టుకొచ్చింది. దీని పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువ. ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది ఎంత స్ప్రెడ్ అవుతుందనేది ఇప్పుడే అంచనాలకు ఎవరూ రాలేరు. ఇది గతంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వ్యక్తులకు, టీకాలు వేసిన వ్యక్తులకు కూడా వ్యాధి సోకేలా చేస్తుంది. ఇది ఇంతకుముందు కరోనా మాదిరి ప్రభావం చూపిస్తుందని కానీ లేదా ఎక్కువ మందికి వస్తుందని కానీ ఎటువంటి ఆధారాలు లేవు.

వ్యాధి లక్షణాలు

వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. జ్వరం లేదా చలి దగ్గు, తలనొప్పులు,శ్వాస ఆడకపోవుట, సర్ది లేదా ముక్కు కారటం, గొంతు మంట, అలసట, నోటికి రుచి, వాసన కోల్పోవడం, తిమ్మిరి, అతిసారం లక్షణాలు రావచ్చు. COVID-19 ఉనికిలో ఉన్నంత కాలం, కొత్త వైవిధ్యాలు ఉద్భవించవచ్చని CDC స్పష్టం చేసింది. అయితే, ఈ వేరియంట్‌లలో ఎక్కువ భాగం మునుపటి వాటితో పోలిస్తే చాలా చిన్న మార్పులను కలిగి వుంటాయి. చాలా వరకు, ఈ కొత్త వేరియంట్‌లు పెద్దగా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపవంటున్నారు వైద్య నిపుణులు.

మాస్క్‌లు, శానిటైజర్‌లు, కోవిడ్ డ్రగ్‌లు, కోవిడ్ కు ఉపయోగించిన డయాగ్నొస్టిక్ టెస్టులు RTPCR, రాపిడ్ టెస్టులు దీనికి కూడా పనిచేస్తాయి. ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. వైరస్ మీ వరకు వచ్చిన చిన్న సింప్టమ్స్ జలుబు మాదిరి వచ్చి పోతుంది. మరో మహమ్మారి వచ్చే అవకాశం లేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…