Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udan Scheme: ఉడాన్ పథకంలో భాగంగా ఐదు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..

దేశానికి ఐదు కొత్త విమానాశ్రయాలు, ఆరు హెలిపోర్ట్‌లు, 50 కొత్త విమాన మార్గాలను ప్రభుత్వం బహుమతిగా ప్రకటించింది.

Udan Scheme: ఉడాన్ పథకంలో భాగంగా ఐదు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..
Udan Scheme
Follow us
KVD Varma

|

Updated on: Sep 10, 2021 | 3:17 PM

Udan Scheme: దేశానికి ఐదు కొత్త విమానాశ్రయాలు, ఆరు హెలిపోర్ట్‌లు, 50 కొత్త విమాన మార్గాలను ప్రభుత్వం బహుమతిగా ప్రకటించింది. విమానాశ్రయాలు గుజరాత్‌లోని కేశోడ్, జార్ఖండ్‌లోని దేవఘర్, గోండియా, మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని కుశీనగర్‌లో నిర్మిస్తారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ, అల్మోరాతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి, మండి, బద్దిలో హెలిపోర్ట్‌లు నిర్మితమవుతాయి. 50 కొత్త ఎయిర్ రూట్లలో, 30 అక్టోబర్ లోనే ప్రారంభమవుతాయి.

ఈ పథకం ఆగస్టు 30 నుంచి నవంబర్ 30 లోపు పూర్తవుతుంది

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాల గురించి సమాచారం ఇచ్చారు. ఈ పనులను నిర్వహించడానికి ఆయన మంత్రిత్వ శాఖ 100 రోజులను ప్లాన్ చేసింది. ఇది ఎనిమిది విధాన స్థాయిలు, నాలుగు మౌలిక సదుపాయాలు, నాలుగు సంస్కరణలతో సహా 16 అంశాలపై దృష్టి పెడుతుంది. వివిధ ప్రాంతాల కోసం వివిధ సలహా సమూహాలు ఏర్పడ్డాయి. ఈ పథకం ఆగస్టు 30 నుంచి నవంబర్ 30 లోపు పూర్తవుతుంది.

కుషినగర్‌లో విమానాశ్రయం..బౌద్ధ సర్క్యూట్‌కు కేంద్ర బిందువుగా మారుతుంది

ఉత్తర ప్రదేశ్ లోని కుషినగర్ లో రూ .255 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు సింధియా తెలిపారు. ఎయిర్‌బస్ 321, బోయింగ్ 737 వంటి విమానాలు ఇక్కడ దిగవచ్చు. కుషినగర్ బౌద్ధ సర్క్యూట్ కేంద్ర బిందువుగా మారుతుంది. త్రిపురలోని అగర్తలాలో రూ .490 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం, ప్రతి గంటకు 500 మంది ప్రయాణీకులు ఇక్కడకు వెళ్లవచ్చు. పెట్టుబడి తర్వాత, ఇక్కడ ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం గంటకు 1200 మంది ప్రయాణికులకు పెరుగుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో 30 వేల కోట్లతో విమానాశ్రయం..

ఉత్తర ప్రదేశ్‌లోని జెవార్‌లో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని పౌర విమానయాన మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తర ప్రదేశ్ మాత్రమే కాదు, దేశం మొత్తానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. 30,000 కోట్లు ఇందులో పెట్టుబడి పెదతారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ విమానాశ్రయంలో రూ .457 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ కొత్త టెర్మినల్ భవనం ఏర్పాటు అవుతుంది. దీని నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం 250 కాగా, ఇది 1,800 మంది ప్రయాణీకులకు పెరుగుతుంది.

Also Read: Vaccination: ఈ రాష్ట్రాలలో 100 శాతం టీకాలు వేయడం పూర్తి..! మీ రాష్ట్రం ఇందులో ఉందా..?

JioPhone Next Launch: రిలయన్స్‌ కస్టమర్లకు నిరాశ.. ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌ విడుదల వాయిదా.. మరి ఎప్పుడంటే.!