Covid-19: మహారాష్ట్రలో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 8,333 పాజిటివ్‌ కేసులు

Covid-19: దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య ..

Covid-19: మహారాష్ట్రలో భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో 8,333 పాజిటివ్‌ కేసులు
Follow us

|

Updated on: Feb 26, 2021 | 10:27 PM

Covid-19: దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక మహారాష్ట్రాలో కరోనా కలకలం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో అక్కడ ఏకంగా 8333 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో..మొత్తం కేసుల సంఖ్య 21,38,154కు చేరుకుంది. లోకల్ ట్రెయిన్లు ప్రారంభమవడం కూడా కరోనా కేసులు పెరగడానికి ఓ కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో కరోనా వ్యాప్తి మరింత తీవ్రతరం అవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్‌గా నిలిచిన ముంబైలో ఇటీవల రోజువారి కరోనా కేసుల సంఖ్య స్వలంగా పెరిగింది. శుక్రవారం నాడు 1,034 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత మూడు రోజుల్లో ముంబైలో సగటున ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు.. శుక్రవారం ఒక్కరజునే మొత్తం 4963 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర రికవరీ రేటు 94.35 శాతంగా ఉంది.

భయాందోళన కలిగిస్తున్న కేసులు

అయితే దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోవడంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగు పెట్టే వారిపై నిఘా పెట్టారు. కరోనా నెగెటివ్‌ రిపోర్టుతో వస్తే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. అలాగే మాస్కులు ధరించని వారిపై కూడా కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో కోట్లాది రూపాయలుగా మాస్కులు ధరించని వారిపై వసూలు చేసినట్లు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. మరిన్ని ఆంక్షలు విధిస్తేనే కరోనా కట్టడిలోకి వస్తుందని భావించిన అధికారులు.. నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.

Also Read: Coronavirus: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..?

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే