నిబంధనలు, చట్టాలు ప్రజల మేలు కోరకే.. వేధించడానికి కాదుః ప్రధాని మోదీ
మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా NDA ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు NDA నాయకులు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సమావేశంలో, ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించి అనేక అంశాలపై చర్చించారు.

మంగళవారం (డిసెంబర్ 9) పార్లమెంట్ హౌస్‌లో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా NDA ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు NDA నాయకులు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సమావేశంలో, ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించి అనేక అంశాలపై చర్చించారు. ప్రజలతో కనెక్ట్ అవ్వాలని కూఆయన వారిని కోరారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో జరిగిన NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రాంతాలకు ఏమి చేయాలో ఎంపీలతో ప్రధాని మోదీ పంచుకున్నారని సమావేశం గురించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరించారు. ఆర్థిక రంగంలోనే కాకుండా ప్రతి రంగంలోనూ సంస్కరణలు అమలు చేయాలి. ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ఎంపీలు కృషి చేయాలని ప్రధాని కోరారు.
ఎంపీలందరూ తమ నియోజకవర్గాల కోసం పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు. నియమ నిబంధనలు మంచివని, కానీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆయన అన్నారు. చట్టాలు ప్రజల జీవితాన్ని సులభతరం చేయడానికే ఉద్దేశించివన్నారు. క్రీడలకు సంబంధించి మరిన్ని పనులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువతతో కనెక్ట్ అవ్వాలని ఎంపీలను ఆయన కోరారు. దేశంలోని ప్రతి రంగంలో సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమావేశంలో ప్రధానంగా చర్చించనట్లు కిరణ్ రిజిజు తెలిపారు. 30-40 పేజీల ఫారమ్‌లు, అనవసరమైన కాగితపు పని సంస్కృతిని అంతం చేయాలనుకుంటున్నట్లు ప్రధాని అన్నారు. పౌరుల ఇంటి వద్దకు సేవలను తీసుకెళ్లాలని, పునరావృత డేటా సమర్పణ ప్రక్రియను తొలగించాలని ఆయన చెప్పారు.
భారత పౌరులు అనే కారణంతోనే భారత పౌరులెవరూ ప్రభుత్వం నుండి ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా చూసుకోవడం మన బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు. నియమాలు, చట్టాలు మంచివే, కానీ వాటిని వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగించాలి, ప్రజలను వేధించడానికి కాదు. ప్రభుత్వ సంస్కరణలు పూర్తిగా పౌర కేంద్రీకృతమైనవని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలుగా రోజువారీగా ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యమన్నారు.
Earlier today, attended a meeting of NDA MPs. We discussed various issues, notably ways to further our good governance agenda to realise our dream of a Viksit Bharat. pic.twitter.com/h9Fo6o1BUo
— Narendra Modi (@narendramodi) December 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




