జమ్ము-కాశ్మీర్‌లో అరుదైన దృశ్యం.. హిందూ వ్యక్తికి ముస్లింల దహన సంస్కారం!
కాశ్మీర్ పేరు చెప్పగానే ఉగ్రవాదం గుర్తకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అక్కడి ప్రజలు అందరూ ఒకేలా ఉండరు అని చాటిచెప్పే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఖాజీగుండ్ ప్రాంతంలో నివసించే ఓ బెంగాల్ వాసి చనిపోవడంతో స్థానిక ముస్లింలు అందరూ కలిసి హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోడంతో గ్రామస్తులే కుటుంబంగా మారారు.

కాశ్మీర్ పేరు చెప్పగానే ఉగ్రవాదం గుర్తకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అక్కడి ప్రజలు అందరూ ఒకేలా ఉండరు అని చాటిచెప్పే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఖాజీగుండ్ ప్రాంతంలో నివసించే ఓ బెంగాల్ వాసి చనిపోవడంతో స్థానిక ముస్లింలు అందరూ కలిసి హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోడంతో గ్రామస్తులే కుటుంబంగా మారారు. అనారోగ్యంతో ఉన్నప్పటి నుంచి గ్రామస్తులు సపర్యలు చేశారు. చివరికి చనిపోయిన తర్వాత అతని మత సాంప్రదాయాలను అనుసరించి దహన సంస్కారాలు నిర్వహించారు.
ముస్లిం యువకులు అతన్ని భుజాలపై మోసుకుని, మోక్షధామ్ చేరుకున్న తరువాత, హిందూ ఆచారాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కుల, మతాలకు అతీతంగా.. ఈ గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. మానవత్వమే గొప్ప మతం అని వ్యాఖ్యానించారు. మేము ఈ పని ఏ మతం కోసం కాదు, మొదట మానవత్వం కోసం చేసాము. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది మా సందేశం. హిందూ లేదా ముస్లిం అనే తేడా లేదు. మానవ జీవితంలో అతి ముఖ్యమైన విషయం మానవత్వం. ఇదే మనం కోరుకునేది. ప్రజలు అవగాహన పెంచుకోవాలి. హిందువులు, ముస్లింలు ఒకరికొకరు అవగాహన కల్పించుకోవాలి. మనం సోదరులమని గ్రామస్తు పేర్కొన్నారు. ఈ ఘటన సాటి మనిషిపై కరుణ.. మానవ విలువలు.. మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తాయని నిరూపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




