Anti Drone System: డ్రోన్ కనిపిస్తే గాలిలోనే ఔట్.. పాక్‌కు చెక్ పెట్టేందుకు రక్షణశాఖ భలే ప్లాన్..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 03, 2021 | 9:41 PM

పాక్‌ డ్రోన్‌ దాడుల ఆట కట్టించడానికి రక్షణశాఖ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది. డ్రోన్లను గాలి లోనే నాశనం చేసే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కొనుగోలుకు డీఆర్‌డీవోకు కాంట్రాక్ట్‌ను అప్పగించారు.

Anti Drone System: డ్రోన్ కనిపిస్తే గాలిలోనే ఔట్.. పాక్‌కు చెక్ పెట్టేందుకు రక్షణశాఖ భలే ప్లాన్..
Anti Drone System

Follow us on

పాక్‌ డ్రోన్‌ దాడుల ఆట కట్టించడానికి రక్షణశాఖ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది. డ్రోన్లను గాలి లోనే నాశనం చేసే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కొనుగోలుకు డీఆర్‌డీవోకు కాంట్రాక్ట్‌ను అప్పగించారు. డ్రోన్‌ దాడుల ముప్పు నుంచి తట్టుకోవడానికి భారత త్రివిధ దళాలు వేగవంతమైన చర్యలు చేపట్టాయి. డీఆర్‌డీవో తయారు చేసిన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కొనుగోలుకు భారత ఆర్మీ , నేవీ , ఎయిర్‌ఫోర్స్‌ కాంట్రాక్ట్‌పై సంతకాలు చేశాయి. డీ4ఎస్‌ అని దీనికి పేరు పెట్టారు. బీఈఎల్‌ సంస్థ డీఆర్‌డీవో తరపున ఈ యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ను తయారు చేస్తుంది. రక్షణశాఖ ఈ డీల్‌కు ఓకే చెప్పింది. డ్రోన్ల కదలికకను గుర్తించడం, వెంటాడడంతో పాటు ధ్వంసం చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. పాక్‌ డ్రోన్లు భారత భద్రతకు పెనుముప్పుగా మారాయి. తరచుగా డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది పాక్‌.

దీనిని తిప్పికొట్టడానికి సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయడం ఇదే తొలిసారి. జమ్మూ ఎయిర్‌బేస్‌పై మూడు పాక్‌ డ్రోన్లు దాడి చేసిన తరువాత ఈ సిస్టమ్‌ను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ముళ్లును ముళ్లు తోనే తీయాలన్న ఆలోచనతో భారత త్రివిధ దళాలు ఉన్నాయి.

దీని కోసం భారత సైన్యం డీఆర్‌డీవో – బీఈఎల్‌ సంస్థల సహకారాన్ని తీసుకుంది. రెండు విధాలుగా ఈ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను తయారు చేస్తున్నారు. డీఆర్‌డీవోకు చెందిన పలు ల్యాబ్‌ల్లో ఈ సిస్టమ్స్‌ను తయారు చేస్తున్నారు. ఆగస్ట్‌ 31న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

హైదరాబాద్‌ , బెంగళూర్‌ , డెహ్రాడూన్‌ , పుణే , మచిలీపట్నంలో ఉన్న డీఆర్‌డీవో ల్యాబ్‌ల్లో ఈ యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ తయారీ జరుగుతుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను తయారు చేస్తున్నారు.

లేజర్‌ టెక్నాలజీతో డ్రోన్లను ఇది అంతం చేస్తుంది. అంతేకాదు డ్రోన్లను సులభంగా గుర్తించి కదలికలను ఆపేస్తుంది. నేవీకి కూడా ఈ టెక్నాలనీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని రక్షణరంగ నిపుణులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Taliban Panjshir: 450 మంది తాలిబన్లు హతం.. మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu