బాలీవుడ్ ప్రముఖ నటుడికి అస్వస్థత !
బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు, బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న మరణించారు. ఏప్రిల్ 30నే ప్రముఖ నటుడు రిషీకపూర్ మృతిచెందారు.

బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు, బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్ బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త నుండి బాలీవుడ్ పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇర్ఫాన్ మరణించిన మర్నాడే అంటే ఏప్రిల్ 30నే ప్రముఖ నటుడు రిషీకపూర్ మృతిచెందారు. 2018లో క్యాన్సర్ బారిన పడ్డ రిషీకపూర్ అప్పటి నుంచి న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఇటీవలే ఇండియాకు వచ్చిన రిషీ, గురువారం అస్వస్థతకు గురికావడంలోని ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
కాగా, ఇప్పుడు మరో సీనియర్ నటుడు అస్వస్థతకు గురయ్యాడనే వార్తలు బాలీవుడ్‌ని షాక్ గురిచేసింది. ప్రసిద్ద నటుడు నసీరుద్దీన్‌షా అనారోగ్యం పాలయ్యారనే వార్త బాలీవుడ్‌ని కుదిపేసింది. అయితే, నసీరుద్దీన్ షా కుమారుడ మాత్రం తన తండ్రికి అస్వస్థత అన్న వార్తలను ఖండించారు. ఇవన్నీ వదంతులేనని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.