Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం.. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు, సమిష్టి భాగస్వామ్యంతో భారతదేశం వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమిష్టి విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు, ప్రజల మనస్సులలోని సుపరిపాలనను పరీక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు.

ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం.. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ
PM Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 10, 2025 | 3:02 PM

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు, సమిష్టి భాగస్వామ్యంతో భారతదేశం వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమిష్టి విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు, ప్రజల మనస్సులలోని సుపరిపాలనను పరీక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా నమో యాప్‌లో 15 ప్రశ్నలతో కూడిన జన్-మాన్ సర్వే ప్రారంభించారు. వివిధ రంగాలకు సంబంధించిన ఈ ప్రశ్నలకు సమాధానాలను ఉపయోగించి, మోదీ ప్రభుత్వం ప్రజల పరీక్షను ఎంత బాగా ఎదుర్కొనిందో తెలుసుకుంటారు. గత 11 సంవత్సరాలుగా జరిగిన సంక్షేమ, అభివృద్ధి పట్ల తన భావాలను, విశ్వాసాన్ని సోషల్ మీడియా X పై పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం సుపరిపాలన, పరివర్తనపై స్పష్టమైన దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే సూత్రాలతో మార్గనిర్దేశం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం వేగం, స్థాయి , సున్నితత్వంతో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల కేంద్రీకృత, సమ్మిళిత, సమగ్ర పురోగతిపై దృష్టి కేంద్రీకరించింది. నేడు, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, వర్తమాన పరిస్థితులు, డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలక అంశాలపై ప్రపంచ స్వరంగా భారత్ మారింది. ‘‘సమిష్టి విజయం పట్ల గర్విస్తున్నాము. అదే సమయంలో, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే ఆశ, విశ్వాసం, కొత్త సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నామని’’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రభుత్వ పనితీరుని ప్రజలు ఎలా చూస్తున్నారనే దానిపై జన్ మాన్ సర్వే చేపట్టారు. ప్రధానమంత్రి నమో యాప్‌లో ప్రారంభించిన జన్-మాన్ సర్వే గురించి సమాచారాన్ని పంచుకున్నారు. గత 11 సంవత్సరాలలో అనేక సానుకూల మార్పులు జరిగాయని, జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించామని రాశారు. ఈ సర్వేలో పాల్గొనాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సర్వేలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకు, మొదటి ప్రశ్న ఉగ్రవాదంపై భారతదేశం కఠినమైన వైఖరికి సంబంధించినది.

సర్వేలో అడిగిన ప్రశ్నలుః

మొదటి ప్రశ్నః గత దశాబ్దంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం విధానం ఏమిటి?

రెండవ ప్రశ్నః ఒక పౌరుడిగా, జాతీయ భద్రతా సవాళ్లకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన వైఖరితో మీరు ఎంత సురక్షితంగా భావిస్తున్నారు?

3. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా వినబడుతుందని, గౌరవించబడుతుందని మీరు నమ్ముతున్నారా?

4. గత సంవత్సరంలో మీరు ఏ డిజిటల్ ఇండియా ఉత్పత్తి లేదా సేవను ఎక్కువగా ఉపయోగించారు?

5. మహిళలపై దృష్టి సారించిన ప్రశ్న ఏమిటంటే, మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన సంస్కరణగా మీరు ఏమి చూస్తున్నారు?

6. యువతను అనుసంధానించడానికి, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా లేదా విద్యలో సంస్కరణలు యువతకు అవకాశాలను ఎంతవరకు పెంచాయి?

7. వ్యాపారవేత్తలకు ప్రశ్న ఏమిటంటే: మేక్ ఇన్ ఇండియా తయారీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిందని మీరు అనుకుంటున్నారు?

8. జాతీయవాదం, సంస్కృతి ద్వారా ప్రేరణ పొందిన వ్యక్తులకు ప్రశ్న ఏమిటంటే, మీరు ఎలా గర్వంగా భావిస్తున్నారు?

9. ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై స్థానిక, జాతీయ ప్రజా ప్రతినిధుల ఉనికి లేదా జవాబుదారీతనం గురించి మీ అంచనా ఏమిటి?

ప్రస్తుతం ప్రతిపక్షాలు భారతదేశ దౌత్యం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాబట్టి ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగింది. పురుషుల నుండి మహిళల వరకు వృద్ధుల వరకు, సుపరిపాలన నుండి వ్యాపారం వరకు ప్రతి వర్గం అభిప్రాయాలను సర్వేలో చేర్చారు. అభివృద్ధి చెందిన భారతదేశంలో మౌలిక సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యం అనే ఆలోచన గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారికి ఆన్‌లైన్ సర్టిఫికెట్లు కూడా వెంటనే జారీ చేయడం జరుగుతుంది. తద్వారా సర్వేలో పాల్గొన్న వారి పూర్తి రికార్డు నిర్వహించడం జరుగుతుంది.

సాధారణంగా, ఎన్నికల సమయంలో, ప్రభుత్వం లేదా పార్టీలు తమ ప్రజా ప్రతినిధుల అంతర్గత రిపోర్ట్ కార్డులను సిద్ధం చేస్తాయి. కానీ మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ముఖ్యమైన దశలో, ప్రధాని మోదీ ప్రభుత్వంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల రిపోర్ట్ కార్డును సిద్ధం చేయాలనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకుంటుంటే, స్థానిక ప్రతినిధుల పట్ల ప్రజల వైఖరి ఎలా ఉందో ప్రధాని మోదీ చూడాలనుకుంటున్నారు. అందుకే సర్వేలో దీని కోసం ఒక ప్రశ్నను చేర్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..