AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dwarka Fire Accident: భవనంలో అగ్నిప్రమాదం.. 9వ అంతస్థు నుంచి అమాంతం కిందకి దూకేసిన తండ్రి, పిల్లలు! ఆ తర్వాత..

Delhi's Dwarka fire accident: ఢిల్లీలో మంగళవారం (జూన్‌ 10) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ద్వారకాలోని అపార్ట్‌మెంట్‌లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో మంటలను తప్పించుకునే ప్రయత్నంలో భవనంలోని 9వ అంతస్తుపై నుంచి ముగ్గురు కిందకి దూకేశారు. దీంతో ఆ ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు..

Dwarka Fire Accident: భవనంలో అగ్నిప్రమాదం.. 9వ అంతస్థు నుంచి అమాంతం కిందకి దూకేసిన తండ్రి, పిల్లలు! ఆ తర్వాత..
Delhi's Dwarka Fire Accident
Srilakshmi C
|

Updated on: Jun 10, 2025 | 1:35 PM

Share

ఢిల్లీ, జూన్‌ 10: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. అయితే మంటలను తప్పించుకునే ప్రయత్నంలో తొమ్మిదో అంతస్తు నుంచి ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులతో కలిసి కిందకు దూకేశాడు. దీంతో ఆ ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. ఆ భవనంలోని ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీగా ఎగిసిపడటంతో ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన పొరబాటు ముగ్గురిని బలితీసుకుంది.

ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ -13లోని MRV స్కూల్ సమీపంలో ఉన్న శపథ్ సొసైటీ అనే నివాస భవనంలోని 8, 9 అంతస్తులో మంగళవారం (జూన్‌ 10) ఉదయం 9:58 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించగా, ఘటన స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. భవనంలో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక శాఖ స్కై లిఫ్ట్‌ను కూడా మోహరించింది. అయితే అదే భవనంలో మంటల్లో చిక్కుకున్న పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు, వారి తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్కసారిగా 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. తండ్రిని యష్‌ యాదవ్‌ (35)గా గుర్తించారు. యాదవ్ ఫ్లెక్స్ బోర్డు వ్యాపారి. సంఘటన అనంతరం వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక అదే అంతస్థులో ఉన్న యాదవ్ భార్య, వారి పెద్ద కుమారుడిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిని చికత్స కోసం ఐజిఐ ఆసుపత్రికి పంపబడ్డారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపత్ సొసైటీ నివాసితులందరినీ సిబ్బంది ఖాళీ చేయించారు. ప్రమాద తీవ్రతను అరికట్టేందుకు అక్కడి విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్లను పూర్తిగా ఆపివేశారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..