AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ తీరంలో భారీ అగ్నిప్రమాదం.. సింగపూర్‌ నౌకలో పేలుళ్లు..! రెస్క్యూ ఆపరేషన్ వీడియో చూశారా..

కేరళ తీరంలో కంటైనర్ కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని బేపోర్‌ తీరంలో సింగపూర్‌కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మందిని నావికాదళ నౌక INS సూరత్ రక్షించింది. అయితే.. మంటలు చెలరేగగానే నౌక లోని 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో నలుగురు గల్లంతయ్యారు.

కేరళ తీరంలో భారీ అగ్నిప్రమాదం.. సింగపూర్‌ నౌకలో పేలుళ్లు..! రెస్క్యూ ఆపరేషన్ వీడియో చూశారా..
Blaze Hit Container Ship
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2025 | 12:22 PM

Share

కేరళ తీరంలో కంటైనర్ కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని బేపోర్‌ తీరంలో సింగపూర్‌కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మందిని నావికాదళ నౌక INS సూరత్ రక్షించింది. అయితే.. మంటలు చెలరేగగానే నౌక లోని 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో నలుగురు గల్లంతయ్యారు. 14 మందిని మాత్రం కోస్ట్‌గార్డ్‌ , నేవీ సిబ్బంది కాపాడారు. శ్రీలంక నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో నౌకలో ఈ ప్రమాదం జరిగింది. సింగపూర్‌కు చెందిన MV వాన్‌ హాయ్‌ నౌకలో మంటలు చెలరేగిన సమయంలో 40 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన నౌకలో 650 కంటైనర్లు ఉండగా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. మంటలను ఆర్పడానికి నేవీతో పాటు కోస్ట్‌గార్డ్‌ సహాయక చర్యలు చేపట్టాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్‌ నౌక కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. దాదాపు 270 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌక ఈనెల 7న కొలంబో తీరం నుంచి బయల్దేరింది. ఇది ఇవాళ్టికి ముంబయికి చేరుకోవాల్సి ఉంది. కాని నిన్న ఉదయం నౌకలో పేలుడు జరగడంతో భారీ నష్టం జరిగింది. కంటైనర్లలో ఏమున్నదో ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.

కాగా.. మంగుళూరులో కంటైనర్‌ నౌకలో సహాయకచర్యలు .. నాలుగు నౌకలు మంటలార్పుతున్నాయి. ఇప్పటికే 18 మందిని కాపాడిన కోస్ట్‌గార్డ్‌.. నాలుగు నౌకలతో ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కంటైనర్లలో పేలుళ్ల కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా పేలుతూ కంటైనర్లు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ ఎత్తున పొగ దట్టంగా అలుముకుంది. కోస్ట్ గార్డ్‌కు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మంగళూరులోని కుంటికానాలోని ఏజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..