AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమను ఒప్పుకోలేదని విద్యార్ధిని దారుణ హత్య.. పక్కింటి ప్రేమికుడి క్రైమ్‌ కథా చిత్రమ్!

Nagpur Student Killed By Neighbour Over Rejection: ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా చంపి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన నాగ్‌పూర్‌లో బుధవారం (జనవరి 1) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ప్రేమను ఒప్పుకోలేదని విద్యార్ధిని దారుణ హత్య.. పక్కింటి ప్రేమికుడి క్రైమ్‌ కథా చిత్రమ్!
Nagpur Student Killed By Neighbour Over Rejection
Srilakshmi C
|

Updated on: Jan 22, 2026 | 6:23 PM

Share

నాగ్‌పూర్‌, జనవరి 22: నాగ్‌పూర్‌కి చెందిన ఓ కాలేజీ విద్యార్థిని (23) ఉన్నట్లుండి తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులతో సహా అందరూ తొలుత దీనిని ఆత్మహత్యగా భావించారు. అయితే విచారణలో మృతురాలి పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతొ నాగ్‌పూర్ పోలీసులు పొరుగింట్లో ఉన్న 38 ఏళ్ల శేఖర్ అజబ్‌రావ్ ధోరేపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

షేర్ ట్రేడింగ్‌లో కోచింగ్‌ తీసుకుంటున్న బీఏ విద్యార్థిని ప్రాచీ హేమరాజ్ (23) బుధవారం తన బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని కనిపించింది. ప్రాచీ తల్లి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మొదట సూసైడ్‌ కేసుగా నమోదు చేసుకున్నారు. మొదట అందరూ దీనిని ఆత్మహత్య మరణం అనే నమ్మారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ప్రాచీ తలకు తగిలిన బలమైన గాయం కారణంగా మరణించిందని తేలింది. దీనితో పోలీసులు ఇది హత్య కేసని, ఎవరో తప్పుదోవ పట్టించడానికి ఆత్మహత్యగా చిత్రీకరించారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలి పక్కింటిలో ఉన్న శేఖర్ అజబ్‌రావ్ ధోరే అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. దర్యాప్తులో అతను ప్రాచీని ప్రేమిస్తున్నాడని, కానీ ఆమె అతని ప్రేమను తిరస్కరించిందని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడు.

తన ప్రేమను తిరస్కరిండాన్ని తట్టుకోలేక ధోరే ఆమెను చంపాలని కుట్ర పన్నినట్లు తెలిపాడు. సంఘటన జరిగిన రోజు ప్రాచీ తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లగా.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ధోరే ఇంట్లోకి ప్రవేశించాడు. కోపంతో అతను మొదట ఆమెను గొంతు నులిమి చంపాడు. ఆపై ఆమె తలను గోడకు లేదా నేలకు బలంగా కొట్టాడు. నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అతను ఒక స్కార్ఫ్ ఉపయోగించి ఆమె శరీరాన్ని ఉరి మాదిరి వేలాడదీసినట్లు పోలీసులు హత్య జరిగిన తీరును మీడియాకు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు అధికారికంగా హత్య కేసు నమోదు చేసి, నిందితుడు ధోరేను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పక్కింటి ప్రేమికుడి క్రైమ్‌ కథా చిత్రమ్.. విద్యార్ధిని దారుణ హత్య
పక్కింటి ప్రేమికుడి క్రైమ్‌ కథా చిత్రమ్.. విద్యార్ధిని దారుణ హత్య
తులసి మొక్క వాడిందా.. తొలగించేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
తులసి మొక్క వాడిందా.. తొలగించేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
సరస్వతీ దేవి కటాక్షం కోసం.. ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
సరస్వతీ దేవి కటాక్షం కోసం.. ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ది గాంచిన మంగపేట మైన్స్ ఇక లేనట్టే.?
ప్రపంచ ప్రసిద్ది గాంచిన మంగపేట మైన్స్ ఇక లేనట్టే.?
Gold Astrology: ఆ రాశుల వారికి స్వర్ణాభరణ యోగం ఖాయం..!
Gold Astrology: ఆ రాశుల వారికి స్వర్ణాభరణ యోగం ఖాయం..!
ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఇకపై 'డాక్టర్' రోహిత్ శర్మ..అరుదైన గౌరవానికి ఎంపికైన హిట్‌మ్యాన్
ఇకపై 'డాక్టర్' రోహిత్ శర్మ..అరుదైన గౌరవానికి ఎంపికైన హిట్‌మ్యాన్
గుడ్‌న్యూస్.. దావోస్‌లో కుదిరిన మరో బిగ్ డీల్..త్వరలోనే ఉద్యోగాలు
గుడ్‌న్యూస్.. దావోస్‌లో కుదిరిన మరో బిగ్ డీల్..త్వరలోనే ఉద్యోగాలు
కోహ్లి తాగిన ఆ డ్రింక్‌ ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్‌
కోహ్లి తాగిన ఆ డ్రింక్‌ ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్‌
విద్యార్ధిని మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ముక్కలుగా మృతదేహం లభ్యం
విద్యార్ధిని మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ముక్కలుగా మృతదేహం లభ్యం