85 లక్షలు ఖర్చు పెట్టి కోవిడ్ రోగులకు ప్రాణవాయువు ఇస్తున్న ‘ ప్రాణదాత’, ఎక్కడంటే ?
నాగపూర్ లోని ఓ బిలియనీర్ కోవిడ్ రోగుల పాలిట నిజంగా ప్రాణదాత అయ్యాడు. 85 లక్షలు ఖర్చు పెట్టి వారికి ఆక్సిజన్ ఇస్తున్నాడీయ. ప్యారే ఖాన్ అనే ఈ బిలియనీర్ 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చాడట

నాగపూర్ లోని ఓ బిలియనీర్ కోవిడ్ రోగుల పాలిట నిజంగా ప్రాణదాత అయ్యాడు. 85 లక్షలు ఖర్చు పెట్టి వారికి ఆక్సిజన్ ఇస్తున్నాడీయ. ప్యారే ఖాన్ అనే ఈ బిలియనీర్ 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చాడట . నాగపూర్ లోను, చుట్టుపక్కల గల ఆసుపత్రులు ఈయన సమకూరుస్తున్న ఆక్సిజన్ ని వినియోగించుకుంటున్నాయి. సిటీలో ప్రముఖ ట్రాన్స్ పోర్టర్ అయిన ప్యారే ఖాన్.. ఇప్పటివరకు 32 టన్నుల ఆక్సిజన్ ని సమకూర్చాడు. ఇందుకు సొమ్ము చెల్లిస్తామని అధికారులు చెప్పినా నిరాకరించాడు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉచితంగా ఇలా చేయడం తన విధి అని చెబుతున్నాడు. ఈ కోవిద్ సమయంలో ఈ విధంగా ప్రాణవాయువు కోసం ఖర్చు పెట్టడం తన సేవా ధర్మంలో భాగమని వినమ్రంగా తెలిపాడు. ప్యారే ఖాన్ జీవితమేమీ పూల పాన్పు కాదు. 1995 ప్రాంతంలో నాగపూర్ రైల్వే స్టేషన్ లో కమలా పండ్లు మొదలైనవి అమ్మేవాడట. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈయన అంచెలంచెలుగా ఎదిగి నేడు 400 కోట్ల విలువైన ట్రాన్స్ పోర్ట్ కంపెనీకి ఆధిపతి అయ్యాడు.
116 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను సిటీలోని ఎయిమ్స్ తో బాటు వివిధ ఆసుపత్రులకు అందజేయాలన్నది ప్యారేఖాన్ లక్ష్యమట. బెంగుళూరు నుంచి వచ్చిన రెండు క్రయోజెనిక్ గ్యాస్ ట్యాంకర్లకు ఈయన మూడు రెట్లు ఎక్కువగా సొమ్ము చెల్లించి తీసుకున్నాడని ఈయన సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. ఖాన్ సంస్థలో 1200 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. ఆక్సిజన్ ని రవాణా చేయడం పెద్ద సవాలు అని ప్యారేఖాన్ అంటున్నారు. ఇందుకు ఇంకా సిబ్బంది అవసరమని ఆయన చెబుతున్నారు . సిటీలోని పలు ధార్మిక సంస్థలు కూడా ఈయన నిస్వార్థ సేవా గుణాన్న్ని ప్రశంసిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్వీ రమణ



