NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్వీ రమణ

Fake Twitter Account: సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో

NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్వీ రమణ
NV Ramana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 27, 2021 | 8:11 AM

Fake Twitter Account: సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పేరుతోనే కొందరు నకిలీ ట్విట్ట‌ర్ ఖాతా సృష్టించి తప్పుడు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇలా త‌ప్పుడు సందేశాలు పోస్ట్ చేయ‌డాన్ని గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి వెంటనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా శ‌నివారం ప్ర‌మాణ‌ం చేసిన ఎన్వీ ర‌మ‌ణ‌కు సోషల్ మీడియా తదితర ప్లాట్‌ఫాంలల్లో ఎలాంటి ఖాతాలు లేవు. అయితే @NVRamana పేరుతో ట్విట్ట‌ర్‌లో ఒక న‌కిలీ ఖాతా ఉంది. ఇప్పటివరకు దీనిలో 98 ఫేక్‌ పోస్టులు షేర్ చేశారు. అయితే ట్విట్టర్ హ్యాండిల్‌ను 5,859 మంది ఫాలో అవుతున్నారు. నిన్న ఇదే ట్విట్టర్ ఖాతాలో “అజిత్ డోవల్ దౌత్యం కారణంగా, భారతదేశానికి ఔషధ ముడి పదార్థాలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది #vaccination @PMOIndia.. అని తాజాగా ఫేక్‌ ట్వీట్ చేసి అనంత‌రం డిలీట్ చేశారు. ఇది జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దృష్టికి వ‌చ్చింది. దీంతో ఆయ‌న దీనిపై ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Nv Ramana Fake Twitter Account

Nv Ramana Fake Twitter Account

కాగా.. భారత 48 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ 24న రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయన ఆగస్టు 26, 2022 వరకు భారత అత్యున్నత న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి భారత రెండవ ప్రధాన న్యాయమూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. అంతకుముందు జస్టిస్ కె సుబ్బారావు 1966-67 వరకు భారత తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

Also Read:

Covid-19: ఇంట్లో ఉన్నా.. మాస్క్ ధరించాల్సిందే.. లేకపోతే అందరికీ కరోనా.. నీతి ఆయోగ్ కీలక ప్రకటన

కోవిడ్ సెంటర్ గా ఫైవ్ స్టార్ హోటల్, ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ అధికారులకు ప్రత్యేకం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!