సీఏఏపై రాధ్ధాంతమెందుకు ? ఇదిగో ప్రూఫ్ ! నిర్మల
సీఏఏను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయని, అయితే ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుధ్ధమని అన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. నిజానికి గత ఆరేళ్లలో 2,838 మంది పాకిస్తానీయులు, 914 మంది ఆఫ్ఘన్లు, 172 మంది బంగ్లాదేశియులు భారత పౌరసత్వం పొందారని ఆమె చెప్పారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. గత రెండేళ్లలోనే 391 మంది ఆఫ్ఘన్లకు, 1595 మంది పాకిస్తానీయులకు ఇక్కడి పౌరసత్వం లభించిందని తెలిపారు. కేంద్ర హోం […]

సీఏఏను అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయని, అయితే ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుధ్ధమని అన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. నిజానికి గత ఆరేళ్లలో 2,838 మంది పాకిస్తానీయులు, 914 మంది ఆఫ్ఘన్లు, 172 మంది బంగ్లాదేశియులు భారత పౌరసత్వం పొందారని ఆమె చెప్పారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. గత రెండేళ్లలోనే 391 మంది ఆఫ్ఘన్లకు, 1595 మంది పాకిస్తానీయులకు ఇక్కడి పౌరసత్వం లభించిందని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన గణాంకాలను ఆమె ప్రస్తావిస్తూ..ఇలా పౌరసత్వం పొందినవారిలో ముస్లిములు కూడా ఉన్నారన్నారు. 2014 నుంచి ఈ మూడు దేశాలకు చెందిన అనేకమంది ముస్లిములకు భారత సిటిజన్ షిప్ లభించిన విషయాన్ని విస్మరించరాదన్నారు.
వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. సవరించిన చట్టంపై పార్లమెంటులో విపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ ప్రభుత్వం సమాధానమిచ్చిందని ఆమె గుర్తు చేశారు. శ్రీలంక తమిళులు నివసిస్తున్న శిబిరాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, అయితే మానవహక్కుల సంఘాలు దానిగురించి మాట్లాడవెందుకని ఆమె ప్రశ్నించారు.



