నిర్భయ కేసులో కీలక పరిణామం.. దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత

నిర్భయ కేసులో మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ లాంటి ఆఖరి అస్త్రాలు ముగిసిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మరో పిటిషన్‌‌తో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను మైనర్‌ని అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. […]

నిర్భయ కేసులో కీలక పరిణామం.. దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత
Follow us

|

Updated on: Jan 20, 2020 | 4:19 PM

నిర్భయ కేసులో మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ లాంటి ఆఖరి అస్త్రాలు ముగిసిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మరో పిటిషన్‌‌తో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను మైనర్‌ని అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ముఖేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన తరువాత, తాజా వారెంట్ ప్రకారం, ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. నిర్బయ ఘటన సమయంలో పవన్ మైనర్ అని చెప్పడానికి కీలక ఆధారాలు ఉన్నాయని అతని తరుపు లాయర్ ఏపీ సింగ్ కోర్టుకు విన్నవించారు. ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకు వెల్లడించారు. అయితే దోషి తరపు న్యాయవాది వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. అతడు మైనర్ కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్ధించింది. సమయాన్ని వృథా చేయడం కోసమే పదే, పదే పిటిషన్స్ వేస్తున్నారని, ఒకే అంశంపై ఇన్నిసార్లు పిటిషన్‌ దాఖలు చేయకూడదని పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని ధర్మాసనం మందలించింది.

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!