AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌లో భారీగా హిమపాతం.. సహాయక చర్యలు ముమ్మరం!

నేపాల్ లోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం సమీపంలో హిమపాతం సంభవించింది. ఈ ప్రాంతం హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన అన్నపూర్ణ కోసం బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉంది. ప్రకృతిపరమైన కారణాలతో పెద్ద ఎత్తున మంచు ఆకస్మికంగా విరుచుకుపడటాన్ని హిమపాతం అంటారు. దీంతో నలుగురు దక్షిణ కొరియన్లు మరియు ముగ్గురు నేపాలీ గైడ్లు తప్పిపోయారు. 150మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఈ ప్రాంతం నుండి రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే ట్రెక్కింగ్ చేసేవారు తప్పిపోయిన ప్రధాన ప్రదేశం హిమపాతం […]

నేపాల్‌లో భారీగా హిమపాతం.. సహాయక చర్యలు ముమ్మరం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 20, 2020 | 4:04 PM

Share

నేపాల్ లోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం సమీపంలో హిమపాతం సంభవించింది. ఈ ప్రాంతం హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన అన్నపూర్ణ కోసం బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉంది. ప్రకృతిపరమైన కారణాలతో పెద్ద ఎత్తున మంచు ఆకస్మికంగా విరుచుకుపడటాన్ని హిమపాతం అంటారు. దీంతో నలుగురు దక్షిణ కొరియన్లు మరియు ముగ్గురు నేపాలీ గైడ్లు తప్పిపోయారు. 150మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఈ ప్రాంతం నుండి రక్షించినట్లు అధికారులు తెలిపారు.

అయితే ట్రెక్కింగ్ చేసేవారు తప్పిపోయిన ప్రధాన ప్రదేశం హిమపాతం వల్ల మంచుతో కప్పబడినందున మేము అక్కడ హెలికాప్టర్లను ల్యాండ్ చేయలేకపోయాము అని సిమ్రిక్ ఎయిర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యోగేశ్ సప్కోటా తెలిపారు. తన సంస్థ 80 నుండి 100 మందిని రక్షించిందని, చాలామంది సమీప నగరమైన పోఖారాకు చేరుకున్నారు” అని ఆయన చెప్పారు.

సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, తప్పిపోయిన ఏడుగురి పరిస్థితి ఇంకా తెలియరాలేసని హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు తెలిపాయి. వసంతఋతువు, శరదృతువు హిమాలయాలలో ట్రెక్కింగ్‌కు అనువైన సీజన్‌గా పరిగణించబడుతున్నాయి, అయినప్పటికీ, చాలా మంది విదేశీయులు శీతాకాలంలో అడ్వెంచర్ కోసం పర్వతారోహణను ఎంచుకుంటారని ట్రెక్కింగ్ కంపెనీలు చెబుతున్నాయి.

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!