Viral: ఫుట్‌పాత్‌పై అనుమానాస్పద చెత్త బాక్స్.. ఏంటని తెరిచి చూడగా.. కళ్లు బైర్లు!
ఓ ఫుట్‌పాత్‌పై అనుమానాస్పద రీతిలో చెత్త బాక్స్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఏంటని చూడాలంటే వారి గుండెలు దడదడలాడాయి.
ఓ ఫుట్‌పాత్‌పై అనుమానాస్పద రీతిలో చెత్త బాక్స్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఏంటని చూడాలంటే వారి గుండెలు దడదడలాడాయి. అందుకే అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు ఆ ప్లేస్‌కి వచ్చి తనిఖీ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ముంబైలోని మౌలానా షౌకత్ అలీ రోడ్‌లో ఉన్న ఓ ఫుట్‌పాత్‌పై అనుమానాస్పద చెత్త బాక్స్ ఒకటి పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అది కదులుతూ కనిపించడంతో అందులో ఏదో ఉందనుకున్న ఓ జంతు హక్కుల కార్యకర్త ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు స్పాట్‌కు చేరుకొని ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. చెత్త డబ్బాల మధ్య ఉన్న ఆ పెట్టెలో ఏముందా అని తెరిచి చూడగా.. ఒక్కసారిగా ఏడు నెలల మొసలి పిల్ల ఒక్కటి బయటకొచ్చింది. సుమారు 1.2 అడుగుల పొడవున్న ఆ మొసలి అక్కడికి ఎలా చేరుకుందో.. అధికారులు చుట్టుప్రక్కల వారిని అడిగి తెలుసుకోగా.. ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
కాగా, ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు.. స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించి సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. ఆ మొసలిని పెట్టెలో అక్కడికి ఎవరు తీసుకొచ్చారు.? స్మగ్లింగ్ ముఠా ఏమైనా అక్రమ రవాణా చేస్తోందా.? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికైతే మొసలి అటవీశాఖ సంరక్షణలో ఉంది. కాగా, మొసళ్ల అక్రమ రవాణా చాలాకాలంగా సాగుతోంది. వాటి చర్మంతో హ్యాండ్‌బ్యాగ్‌లను పలు లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌లు తయారు చేస్తున్నాయి.