AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం.. ‘మదర్‌ ఆఫ్ సైతాన్’…!

ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారుబాంబు పేలి వారం రోజులౌతోంది. 13 మందిని బలితీసుకున్న ఆ పేలుడు తీవ్రత గురించి చర్చ మాత్రం అగడం లేదు. పోలీసుల్ని సైతం విస్తుగొలిపే షాకింగ్ డీటెయిల్ మరొకటి బైటికొచ్చింది. అదే మదర్ ఆఫ్ సైతాన్..? ఏమిటా మహా సైతాన్?

Delhi Blast: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం.. 'మదర్‌ ఆఫ్ సైతాన్'...!
Delhi Blast
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2025 | 7:55 PM

Share

నవంబర్ 10.. ఢిల్లీ ఎర్రకోట దగ్గర చాందినీ చౌక్ మార్కెట్ చౌరస్తాలో కారుబాంబు పేలుడు.. ఒక భయానక దృశ్యాన్ని మిగిల్చింది. 10 కార్లు శిథిలాల కింద మారిపోయి, 30 మంది శరీరభాగాలు చెల్లాచెదరైన ఘోర దుర్ఘటన అది. తర్వాత, నౌగామ్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన బిగ్‌ బ్లాస్టింగ్‌లో కూడా దాదాపుగా ఇదే సీన్. తొమ్మిదిమంది చనిపోయి, శరీరభాగాలు 300 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పేలుళ్ల తీవ్రతను బట్టి.. ఈ రెండు ఘటనలకు ఒక పోలిక ఉందన్నది ఫోరెన్సిక్‌ నిపుణుల అంచనా. దాని పేరే TATP.. మదర్ ఆఫ్ సైతాన్.

పేలుళ్లకు వాడింది IED అని తెలుసు. కానీ, అందులో అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్టు మాత్రమే ఇప్పటిదాకా తెలుసు. కాకపోతే, ఇది మిలటరీ గ్రేడ్‌ బ్లాస్టింగ్‌ అని అప్పట్లోనే అనుమానించారు. ఇప్పుడు కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి. పేలుడు కోసం TATP అనే బ్లాస్టింగ్ మెటీరియల్ వాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తులో వ వెలుగుచూసిన సంచలన కోణమిది.

T-A-T-P… అంటే ట్రై అసిటోన్‌ ట్రై పెరాక్సైడ్‌. IEDలో ఇతర రసాయనాలతోపాటు TATP కూడా వాడినట్లు ఫోరెన్సిక్‌ బృందాలు పసిగట్టాయి. IEDలో 3 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తోపాటు, పెట్రోల్‌, డీజిల్‌ కూడా వాడినట్లు గ్రహించారు. అన్ని రసాయనాలతో TATP బాంబు కనీస బరువు 50 కిలోల దాకా ఉంటుంది. ఇది పేలడానికి డిటోనేటర్లు అవసరం లేదు. కరెంట్‌ షాక్‌, అధిక వేడి, చిన్నపాటి ఘర్షణ, లేదంటే ఎలక్ట్రోస్టాటిక్‌ డిశ్చార్జ్‌.. వీటిలో ఏది జరిగినా TATP పేలిపోతుంది.

TATP ఎంత డేంజర్ అంటే, ఇది చిన్న మోతాదులో ఉన్నా, హ్యాండిల్ చేయడం కష్టం. తయారీ, రవాణా సమయంలో కూడా ఇది పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్‌ఫెక్ట్‌గా తీసుకెళ్లి పేల్చేస్తే దీని ప్రభావం TNT, అంటే ట్రై నైట్రో టాలిన్‌లో 80 శాతం దాకా ఉంటుందని ఒక అంచనా. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీన్ని మదర్‌ ఆఫ్‌ సైతాన్‌గా పిలుస్తారు. భారీఎత్తున హింస చెలరేగాలంటే, మారణహోమానికి పాల్పడాలంటే ఉగ్రవాదులు దీన్నే ఎక్కువగా వాడతారు.

2001 డిసెంబర్‌లో అమెరికా విమానంలో 63 మందిని బలితీసుకున్న షూబాంబర్‌ ఆత్మాహుతి దాడి, 2005 జులైలో లండన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి, 2015 నవంబర్‌లో పారిస్‌లో వరుసపేలుళ్లు, 2016 బ్రస్సెల్స్‌లో జరిగిన ఆత్మాహుతిదాడి, 2017 మేలో మాంచెస్టర్‌ బాంబింగ్‌.. ఇవన్నీ TATP వాడకంతో జరిగినవే. ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లలో కూడా జైషే ముష్కరులు మదర్‌ ఆఫ్ సైతాన్‌నే ప్రయోగించారా? ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..