AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kolkata Doctor Murder: మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాలు చెరిపేందుకు యత్నం! దీని వెనుక ఎవరున్నట్లు?

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ కాలేజీలో గత వారం 31 ఏళ్ల మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఇందుకు నిరసనగా బుధవారం రాత్రి ఆందోళన కారులు ఆసుపత్రిలోకి చొచ్చుకొచ్చారు. ఆందోళన ముసుగులో కొందరు అర్ధరాత్రి ఆసుపత్రిపై రాళ్ల దాడి చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బలప్రయోగం చేశారు..

Kolkata Doctor Murder: మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాలు చెరిపేందుకు యత్నం! దీని వెనుక ఎవరున్నట్లు?
Kolkata Doctor Murder
Srilakshmi C
|

Updated on: Aug 15, 2024 | 1:27 PM

Share

కోల్‌కతా, ఆగస్టు 15: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ కాలేజీలో గత వారం 31 ఏళ్ల మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఇందుకు నిరసనగా బుధవారం రాత్రి ఆందోళన కారులు ఆసుపత్రిలోకి చొచ్చుకొచ్చారు. ఆందోళన ముసుగులో కొందరు అర్ధరాత్రి ఆసుపత్రిపై రాళ్ల దాడి చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బలప్రయోగం చేశారు. ఈ దాడిలో పోలీసుల వాహనాలతోపాటు ఆసుపత్రి ఫర్నీచర్‌ కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో గత రాత్రి జరిగిన మూక హింసలో నాలుగో అంతస్తులోని హాస్పిటల్ సెమినార్ హాల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించిన గదిని ధ్వంసం చేశారన్న వార్త దావానంలా వ్యాపించింది. ఆధారాలు లభ్యంకాకుండా సెమినార్‌ గదిని పూర్తిగా ధ్వంసం చేశారనే వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై కోల్‌కతా పోలీసులు స్పందించారు. ‘ఆందోళన కారులు క్రైమ్ ఆఫ్ సీన్ సెమినార్ రూమ్‌ను ధ్వంసం చేయలేదు. ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయవద్దు. మేము అల్లరిమూకను అడ్డుకున్నాం. పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని’ పోలీసులు ప్రకటనల విడుదల చేశారు.

భయానక సంఘటనకు వ్యతిరేకంగా బుధవారం అర్థరాత్రి మహిళలు పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. వారు వాహనాలపై దాడి చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు షెల్లను ఉపయోగించారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. మూక హింస వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఆందోళన కారులందరినీ సురక్షితంగా అక్కడి నుంచి పారదోలారు. లేదంటే అందోళనకారులు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి, కీలకమైన సాక్ష్యాలున్న ప్రాంతాలను ధ్వంసం చేస్తారు. తద్వారా అవి సీబీఐకి చిక్కవని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక తాజా దాడి రాజకీయ రంగు పులుముకుంది. ఆసుపత్రి దగ్గర రాజకీయ వ్యతిరేక ర్యాలీని భగ్నం చేయడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార తృణమూల్.. కాలేజీకి గూండాలను పంపారని ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. నిన్న రాత్రి RG కర్ వద్ద జరిగిన విధ్వంసం అన్ని పరిమితులను మించిపోయింది. హింసకు కారణమైన ప్రతి వ్యక్తిని రాజకీయాలతో సంబంధం లేకుండా రాబోయే 24 గంటల్లో అదుపులోకి తీసుకుంటామన్నారు.

కాగా దేశాన్ని కుదిపేసిన అత్యాచారం, హత్య కేసును సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయకుండా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.