Mamata Banerjee: ఆదివారం వరకు సీబీఐకి సీఎం మమత డెడ్‌లైన్‌.. ఉరి తీయకపోతే

కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో లేడీ డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు కొత్తమలుపు తిరిగింది. గ్యాంగ్‌రేప్‌ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నిందితుడిని ఆదివారం లోగా ఉరితీయకపోతే తానే నిరసన ర్యాలీ చేపడుతానని ప్రకటించారు బెంగాల్‌ సీఎం మమత. ఇక ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల ఆందోళనలు మిన్నంటాయి.

Mamata Banerjee: ఆదివారం వరకు సీబీఐకి సీఎం మమత డెడ్‌లైన్‌.. ఉరి తీయకపోతే
Mamata Banerjee
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2024 | 12:56 PM

కోల్‌కతా డాక్టర్‌పై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందా ? జూనియర్‌ డాక్టర్‌ను రేప్‌ చేసి చంపింది ఒక్కడు కాదా ? చాలామందికి అ దారుణంలో ప్రమేయముందా ? జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. డాక్టర్‌ మృతదేహంపై ఉన్న గాయాలు చూస్తే ఒక్కరి కంటే ఎక్కువమంది ప్రమేయమున్నట్టు తేలిందని పోస్ట్‌మార్టమ్‌ చేసిన డాక్టర్‌ సుబర్ణ గోస్వామి వెల్లడించారు.

లేడీ డాక్టర్‌ చనిపోయిన రోజు ఆమెతో ఉన్న ఏడుగురిని విచారించారు. ఆస్పత్రికి చెందిన మొత్తం 25 మందిని విచారించారు.. మృతురాలి కాల్‌డేటా ఆధారంగా కూడా కొంతమందిని విచారించారు.. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమయ్యింది. అయితే బుధవారమే మర్డర్‌ జరిగిన ప్రదేశంలో కూల్చివేతలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఆధారాలను , సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఈ కూల్చివేతలు జరిపారని బీజేపీ ఆరోపిస్తోంది.

కోల్‌కతా లేడీ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. మృతురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌లో 151 గ్రాములు వీర్యం లభించింది. ఒక్కడి నుంచి ఇంత మొత్తం సాధ్యం కాదని , చాలామందికి నేరంలో భాగస్వామ్యం ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. బాధితురాలి శరీరంపై ఉన్న తీవ్రగాయాలు కూడా ఈ నేరంలో చాలామంది ప్రమేయమున్నట్టు పోస్ట్‌మార్టమ్‌ నివేదిక వెల్లడిస్తోంది.

బాధితురాలి కుటుంబసభ్యులను కూడా ఈ ఘోరంలో ఒక్కడి కంటే ఎక్కువ పాత్ర ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆర్‌జీ కార్‌ ఆస్పత్రి అధికారుల తీరుపై వాళ్లు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు… కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతదేహాన్ని చూపించడానికి మూడు గంటల సమయం తీసున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రేప్‌ మర్డర్‌ విషయం దాచిపెట్టి తమ కూతురు సూసైడ్‌ చేసుకున్నట్టు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. కోల్‌కతాలో ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు కూడా ఇదే ఆరోపణ చేశారు..

” అసలు దోషులను తప్పించే కుట్ర జరిగింది. తొలుత రేప్‌ జరగలేదని , మర్డర్‌ కాదని పోలీసులు చెప్పారు.. దీని వెనుక ఎవరు ఉన్నారు ? పోలీసులపై మాకు నమ్మకం లేదు… సీబీఐ దర్యాప్తులో వాస్తవాలు బయటకు రావాలి.. ఆమె శరీరంపై ప్రతి చోట గాయాలున్నాయి..చాలా కిరాతకంగా హత్య చేశారు.. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని జూనియర్‌ డాక్టర్‌  శోహిని హల్దర్‌ తెలిపారు.

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఆ జూనియర్‌ డాక్టర్‌ గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో ఆమె డెడ్‌బాడీ లభించింది. ఈ కేసులో పోలీసు వాలంటీర్‌ అయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా షాకింగ్‌ సమాచారం వెలుగు లోకి వచ్చింది. ప్రైవేట్‌ పార్ట్స్‌తో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్‌ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు డాక్టర్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..