AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన వ్యక్తిపై ఛార్జిషీట్.. అదేం లేదన్న సీఎం

రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లో జరిగిన మూకదాడి ఘటన, ఆ సందర్భంగా ఒక వ్యక్తి హత్య కేసుపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. 2017లో అళ్వార్ ప్రాంతంలో జరిగిన మూకదాడి కేసులో పెహ్లూఖాన్‌ అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజస్థాన్ పోలీసులు గోవుల స్మగ్లింగ్ చేసినట్టు మృతుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. పెహ్లూఖాన్‌ తన ఇద్దరు కుమారులతో కలిసి వ్యాన్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. […]

చనిపోయిన వ్యక్తిపై ఛార్జిషీట్.. అదేం లేదన్న సీఎం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2019 | 11:06 AM

Share

రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లో జరిగిన మూకదాడి ఘటన, ఆ సందర్భంగా ఒక వ్యక్తి హత్య కేసుపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. 2017లో అళ్వార్ ప్రాంతంలో జరిగిన మూకదాడి కేసులో పెహ్లూఖాన్‌ అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజస్థాన్ పోలీసులు గోవుల స్మగ్లింగ్ చేసినట్టు మృతుడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. పెహ్లూఖాన్‌ తన ఇద్దరు కుమారులతో కలిసి వ్యాన్‌లో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు.

2017లో జగ్‌వాస్ ప్రాంతంలో హైవేపై పెహ్లూఖాన్‌పై దాడి జరిగింది. వాహనాన్ని ధ్వంసం చేసిన గోరక్షకులు పెహ్లూఖాన్‌పై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పెహ్లూఖాన్ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోయారు. అయితే తాజాగా ఈ కేసుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పెహ్లూఖాన్‌ పేరు లేదని తేల్చిచెప్పారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ గత బీజేపీ ప్రభుత్వంలోనే దాఖలైందని తెలిపారు. కేసులో ఏమైనా అనుమానాలు ఉంటే మరోసారి దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. మరో వైపు దోషులను పట్టుకోకుండా కాంగ్రెస్ కూడా బీజేపీలా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?