సోషల్ మీడియాలో ప్రధానిపై దుష్ప్రచారం..పోకిరీల అరెస్ట్
తాజాగా ప్రధాని నరేంద్రమోదీపైనే కామెంట్స్ చేసిన ముగ్గురిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.........

ఈ మధ్య సోషల్ మీడియాలో పోకిరీలు చేస్తున్న చేష్టలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అవతలి వ్యక్తులు ఎంతటి వారైన సరే పట్టించుకోవటంలేదు..ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. తమను ఎవరూ గమనించరు. తాము ఎవరి చేతికి చిక్కేది లేదనుకుని వెకిలీ చేష్టలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇటువంటి పోస్టింగ్‌లకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ప్రధాని నరేంద్రమోదీపైనే కామెంట్స్ చేసిన ముగ్గురిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రధాని నరేంద్రవెూదీని కించపరిచేలా పోస్టింగ్ చేసిన ముగ్గురిపై కేసులు నవెూదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. ధర్మారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దొంగతుర్తికి చెందిన జుంజిపల్లి శంకరయ్య అలియాస్ శేఖర్, గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన యాకుల తిరుపతియాదవ్, పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉయ్యంకర్ సాయి కిరణ్‌పై కేసు నవెూదు చేశామన్నారు. సోషల్ మీడియాలో తప్పు డు పోస్టింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెట్టింట్లో దుష్ప్రచారం చేస్తూ పోస్టింగ్‌లు చేసిన ముగ్గురిపై కేసులు నవెూదు చేసినట్లు వెల్లడించారు.
సోషల్ మీడియా వేదిక గా చేసుకొని వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కొందరు వ్యక్తులు ఇతర మతాలను కించపరిచేలా సందేశాలు అప్‌లోడ్ చేయడం, సమాజంలో పరువు ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు,వ్యవస్థలపై దుమ్మెత్తి పోయడం బురద చల్లడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని కోరారు.