ఉగ్రవాదులకు భారీ షాక్‌..!

ఉగ్రవాదులకు భారీ షాక్‌..!

ఉగ్రవాదులకు భారీ షాక్‌ తగిలింది. తన్వీర్‌ అహ్మద్‌ మాలిక్‌ అనే ఓ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టెర్రరిస్టును భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని టంట్నా గ్రామంలో ఈ ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఇతను హిజ్బుల్ ఉగ్రవాదులకు గ్రౌండ్‌ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి ఓ చైనీస్ పిస్టల్‌తో పాటుగా భారీగా మందు గుండు సామాగ్రి, వైర్‌లెస్‌ సెట్‌తో పాటు పది రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 5:58 PM

ఉగ్రవాదులకు భారీ షాక్‌ తగిలింది. తన్వీర్‌ అహ్మద్‌ మాలిక్‌ అనే ఓ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టెర్రరిస్టును భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని టంట్నా గ్రామంలో ఈ ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఇతను హిజ్బుల్ ఉగ్రవాదులకు గ్రౌండ్‌ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి ఓ చైనీస్ పిస్టల్‌తో పాటుగా భారీగా మందు గుండు సామాగ్రి, వైర్‌లెస్‌ సెట్‌తో పాటు పది రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఈ ఉగ్రవాది దొరికినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు భద్రతా బలాగాల గురించి సమాచారం ఇస్తూ.. వ్యాలీలో సంచరించేందుకు వాహనాలను కూడా సమకూర్చుతూ.. ఆయుధాలను అందించేవాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇతడి నుంచి ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాది ద్వారా.. లోయలో జరిగే ఆపరేషన్‌ స్కెచ్‌తో పాటు.. ఎక్కడెక్కడ ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు..? వారంతా ఎక్కడెక్కడ దాడులకు స్కెచ్‌ వేశారన్న దానిపై సమాచారం రాబట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా.. తన్వీర్‌ పట్టుబడ్డ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu