Jitendra Singh: 60 ఏళ్ల‌లో సాధించ‌లేనిది.. రెండు ద‌శాబ్ధాల్లో సాధించాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

అణు విద్యుత్ ఉత్పత్తిలో గ‌డిచిన 60 ఏళ్ల‌లో సాధించ‌లేనిది, గ‌త రెండు ద‌శాబ్ధాల్లో సాధించిన‌ట్లు కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన తెలియజేశారు.

Jitendra Singh: 60 ఏళ్ల‌లో సాధించ‌లేనిది.. రెండు ద‌శాబ్ధాల్లో సాధించాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌
Central Minister Jithendra Singh
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 12, 2024 | 1:46 PM

భారత అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్ద కాలంలో 2014లో 4,780 మెగావాట్ల నుంచి 2024 నాటికి 8,081 మెగావాట్లకు చేరుకుందని కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2031-32 నాటికి అణుశక్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది అణు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అనేక ఇతర ప్రాజెక్టులు ప్రీ-ప్రాజెక్ట్ దశలో ఉన్నాయని, అణుశక్తి సామర్థ్యాన్ని విస్తరించడంలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు. 10 అణు రియాక్టర్లకు పెద్దమొత్తంలో ఆమోదం, పెరిగిన నిధుల కేటాయింపులు, ప్రభుత్వ రంగ సంస్థలతో సహకారం, పరిమిత ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో సహా అనేక కార్యక్రమాల వల్ల అణు విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. గ‌డిచిన 60 ఏళ్ల‌లో సాధించ‌లేనిది, గ‌త రెండు ద‌శాబ్ధాల్లో సాధించిన‌ట్లు ఆయన చెప్పుకొచ్చారు.

వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రక్షణ రంగం వంటి వివిధ రంగాలలో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయన థోరియంపై కూడా మాట్లాడారు. భారత్ దేశంలో  21 శాతం థోరియం నిల్వ‌లు ఉన్న‌ట్లు ఆయన వెల్లడించారు. భారత్ యురేనియంపై ఆధార‌ప‌ప‌డం త‌గ్గించాలని చూస్తుందని.. అందుకే భ‌వానీ ప్రాజెక్టు ద్వారా థోరియం నిల్వ‌ల‌ను అన్వేషిస్తున్న‌ట్లు ఆయన చెప్పుకొచ్చారు.గత 10 ఏళ్లలో భారతదేశం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు అయినట్లు, 2031-32 నాటికి మూడు రెట్లు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2031-32, 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.2014 తర్వాత రాజకీయ నాయకత్వం అందించిన ఎనేబుల్ పరిసరాలు కీలకంగా మారినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి